సన్నీ లియోన్ అనగానే ఓ శృంగార తారగానే చూస్తున్నాం ఇప్పటికీ. పోర్న్ సినిమాలు వదిలేసి.. దాదాపు పదేళ్లుగా బాలీవుడ్లో హిందీ సినిమాలే చేసుకుంటున్నా.. ఆమె ఇమేజ్ ఏమీ మారలేదు. కానీ సన్నీ మాత్రం తనలోని కొత్త కొత్త కోణాలు చూపిస్తూనే ఉంది. ఛారిటీ కార్యక్రమాలకు భారీగా డబ్బులివ్వడం.. ఓ అనాథ ఆడబిడ్డను దత్తత తీసుకోవడం లాంటి చర్యలతో ఆమె తన గొప్పదనాన్ని చాటుకుంది. ఇప్పుడు సన్నీ తనలోని మరో యాంగిల్ చూపిస్తోంది. ఆమె జనాలకు ఆర్థిక పాఠాలు కూడా చెబుతోంది. తాను తన సొంతంగా తన కెరీర్ ను ఎలా ప్లాన్ చేసుకున్నది.. వ్యాపారాలు ఎలా చేసింది.. కొత్త విషయాలు ఎలా నేర్చుకున్నది ఆమె వివరించింది. స్ఫూర్తిదాయకంగా అనిపించే ఆ విషయాలేంటో తెలుసుకుందాం పదండి.
సన్నీ 18 ఏళ్ల వయసుకే వినోద రంగంలో సొంత వ్యాపారాన్ని ప్రారంభించిందట. తన బ్రాండ్ విలువ పెంచుకునేందుకు పెట్టుబడి పెట్టిందట. సొంతంగా హెచ్టీఎంఎల్ నేర్చుకుని.. వెబ్ సైట్ ఎలా రూపొందించుకోవాలో తెలుసుకుందట. తనే స్వయంగా ప్రోగ్రామ్ తయారు చేసుకోవడంతో పాటు ఫొటోలను ఎడిట్ చేసే కళ కూడా నేర్చుకుందట. ఈ విషయాలన్నీ తనకు తానుగా నేర్చుకున్నానే తప్ప ఎవరూ నేర్పలేదని సన్నీ తెలిపింది. ఓవైపు పోర్న్ సినిమాల్లో భారీగా ఆర్జిస్తూనే.. భారీగా పెట్టుబడులు పెట్టిందట సన్నీ. మ్యూచువల్ ఫండ్లు.. షేర్లు.. స్థిరాస్తి రంగాల్లో భారీ మొత్తం ఇన్వెస్ట్ చేసిందట సన్నీ. ప్రకటనల్లో నటించడంతో పాటు కొన్ని వ్యాపారాలు కూడా చేసింది సన్నీ. ‘లస్ట్’ లాంటి పెర్ఫ్యూమ్స్ తీసుకొచ్చింది. ఇవన్నీ తాను రిస్క్ చేసి పెట్టిన పెట్టుబడులే అని.. ఎక్కువ మార్గాల్లో పెట్టుబడి పెడితే రాబడి బాగా ఉంటుందని ఆమె అంది.
షేర్లలో 40 శాతం స్థిరాస్తి బంగారంలో 30 శాతం పెట్టుబడి పెట్టాలని సన్నీ సూచించింది. తన పెట్టుబడుల్లో అధిక వాటా అమెరికా మ్యాచువల్ ఫండ్లు.. షేర్లలో ఉన్నట్లు ఆమె వెల్లడించింది. స్థిరాస్తి విషయానికి వచ్చేసరికి భారత్ లోనే పెట్టుబడి పెట్టేందుకు సన్నీ ఇష్టపడుతుందట. బంగారంలో పెట్టుబడి అంటే తనకు బంగారు బాండ్లే గుర్తుకొస్తాయట. నేరుగా బంగారం కొనడం తనకిష్టం లేదంటోంది సన్నీ. కొంత డబ్బును వ్యక్తిగత రిటైర్మెంట్ అకౌంట్లో వేస్తున్నట్లు ఆమె తెలిపింది. జీవితపు చివరి రోజులు ఆనందమయంగా గడిపేందుకు ఈ డబ్బు ఉపయోగపడుతుందని ఆమె చెప్పింది. కొన్ని ఎదురు దెబ్బలు తగిలినప్పటికీ తాను పాటించే పొదుపు విధానంపై తనకు పూర్తి నమ్మకముందని తెలిపారు. లాస్ ఏంజెల్స్ లోని హాలీవుడ్ హిల్స్ లో 5 వేల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఓ అందమైన ఇంటిని కొనుగోలు చేయాలన్నది తన ఆశ అని సన్నీ వెల్లడించింది.