సన్నీ లియోన్ పేరు వినగానే కుర్రకారు మది వేడెక్కుతుంది. అంతే కాదు.. సన్నీ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా తక్కువేం కాదు. పోర్న్ స్టార్ సన్నీ లియోన్ అంటే ఇపుడు బాలీవుడ్ హాటెస్ట్ తారలు బెంబేలెత్తిపోతున్నారు. ఘాటు సన్నివేశాలను వేటినైనా అవలీలగా చేయగల సత్తా ఉన్న నటిగా పేరు తెచ్చుకున్న సన్నీ లియోన్ కు అలాంటి పాత్రలే వస్తున్నాయి.
ఈ క్రమంలోనే తెలుగులోనూ తన సత్తా చాటుతోంది సన్నీ లియోన్. ఓపక్క బాలీవుడ్లో నటిస్తూనే.. మరో పక్క టాలీవుడ్‌లోనూ నటిస్తూ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవుతోంది సన్నీ లియోన్.
ముఖ్యంగా ఆమె చేస్తున్న ఐటం సాంగులు యమాగా క్లిక్ అవుతుండటంతో దర్శక నిర్మాతలంతా సన్నీ ముందు క్యూ కట్టేస్తున్నారు. సన్నీ ఓ పాటకు డ్యాన్స్ చేసిందంటే టోటల్ గా ఆ సినిమాపైనే ఆసక్తి పెరుగుతోంది.
ఈ క్రమంలోనే సన్నీలియోన్‌పై ప్రేక్షకులకు ఉన్న ఆసక్తిని వాడుకుందామని అనుకున్న పీ.ఎస్.వీ.గరుడవేగ 126.18ఎం యూనిట్ ఆశలు గల్లంతయ్యాయి.
కాగా, రాజశేఖర్ హీరోగా నటించిన గరుడ వేగ భారీ బడ్జెట్‌తోనే తెరకెక్కింది. సినిమాపై బజ్ క్రియేట్ చేసేందుకు సన్నీలియోన్‌తో డియ్యో.. డియ్యో అనే పాట చిత్రీకరించారు. దాంతోపాటు ఈ సినిమా రిలీజ్ ఈవెంట్ లో సన్నీ డ్యాన్స్ షో కూడా ఉంటుందని ప్రకటించారు. దీంతో అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తే ఆమె స్టేజ్ పైకొచ్చి యాంకర్లతో కలిసి ఓ స్టెప్పు మాత్రం అంతటితో సరిపెట్టేసింది. లైవ్ డ్యాన్స్ షో ఉంటుందని అభిమానులు ఆశతో వస్తే టీజర్ టైపులో సరిపెట్టేసింది. దీంతో అభిమానులు తీవ్ర నిరాశ మధ్య వెనుదిరిగారు.