బాలీవుడ్ బుల్లితెర నటి హీనా ఖాన్ దక్షిణ చిత్ర పరిశ్రమకు చెందిన నటీమణుల గురించి చులకన చేసి మాట్లాడారు. దీంతో హన్సిక మోత్వాని ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. అసలు విషయం ఏంటంటే.. బిగ్‌బాస్ సీజన్ 11 కంటెస్ట్ హీనా ఖాన్.. సౌతిండియన్ సినిమాల్లో నటించే హీరోయిన్లు ఎక్స్‌పోజింగ్ ఎక్కువగా చేస్తారని.. కావాలనే వారు తమ సైజు పెంచుకుంటారని, వాటిని సిగ్గువిడిచి ప్రదర్శిస్తుంటారంటూ ఓ బర్నింగ్ కామెంట్ విసిరింది హీనా ఖాన్.
దీంతో హన్సిక ట్విట్టర్ లో ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసారు. దీని అర్థం ఏమిటి.. దక్షిణ చిత్ర పరిశ్రమను తక్కువ చేసి ఆమె ఇలా ఎలా మాట్లాడుతుంది. చాలా మంది బాలీవుడ్ నటీమణులు మా దక్షిణ చిత్ర పరిశ్రమలో పనిచేశారు, చేస్తున్నారన్న విషయం ఆమెకు తెలియదా. మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడే ప్రయత్నం చేసిన హీనా ఖాన్ సిగ్గుపడాలి. ఓ దక్షిణాది నటిగా.. ఈ చిత్ర పరిశ్రమకు చెందిన నటిని అని చెప్పుకోవడం చాలా గర్వంగా భావిస్తున్నా. హీనా ఖాన్ చెప్పిన మాటలన్నీ పనికిరానివే అని హన్సిక వరుస ట్వీట్లు చేశారు.