తెలుగుదేశం వారు వై.యస్ బ్రతికి ఉన్న రొజుల నుండి ఆయన బౌతికంగా మన మద్య లేక పొయినా నిత్యం ఆయన పై ఫ్యాక్షన్ ముద్ర పడేలా ఆరొపణలు చెసి తమ రాజకీయ పబ్బం గడుపుకుంటు వస్తున్నారు , నిజానికి వై.యస్ చెసింది ఏంటి ?
నిత్యం కక్షలు కార్పణ్యాల మద్య నలిగిన ఒక తరం రాయల సీమలొ , అన్ని వర్గాలని ఈ రక్త భూతం నుండి దూరం చెయటానికి నిత్యం ప్రయత్నించిన వ్యక్తి వై.యస్ – దీనికి సాక్షం 1992 లొనే ఆయన సీమలొ అనుసరించిన విదానం గురించి వచ్చిన పెపర్ క్లిపింగ్ , కక్షల మద్య నలుగుపొతున్న గ్రూపులని ఒక దగ్గరికి చేర్చి రాజీ చేసి సీమలొ ఫ్యాక్షన్ నీ అంతం చెయటానికి ఆయన అందించిన చెయుత దానితొ ఫ్యాక్షన్ ని వదిలిన ఆ వైరి వర్గాలు వై.యస్ విధానం మెచ్చి అనుచరులు గా మారటం తొ రాయల సీమ లొ తిరుగులేని ప్రజానేత గా ఏదిగారు వై.యస్
దీనికి ఉదాహరణ అంబకపల్లి
వై.యస్ చొరవతొ ఫ్యాక్షన్ వదిలిన గ్రామం “అంబకపల్లి”
కడపజిల్లా లింగాల మండలం అంబకపల్లి అనే గ్రామం లొ వై.యస్ పుట్టక ముందు నుండి కొన్ని తరాలు గా ఫ్యాక్షన్ పడగ విప్పి ఆ కక్షలలొ ఆ గ్రామం లొ పదుల సంఖ్యల్లో ప్రజలు ప్రాణాలు పొగొట్టుకున్నారు
1986 లొ వై.యస్ ఆ గ్రామం లొ రెండు ఫ్యాక్షన్ వర్గాలని కుర్చొ పెట్టి ఫ్యాక్షన్ వదిలిపెట్టాలి అని నచ్చ చెప్పి వారి మద్య పంచాయతి చెసి సయొద్య కుదిర్చారు, అప్పటి నుండి ఈ రొజు వరకు ఆ గ్రామం లొ ఒక్క ఫ్యాక్షన్ హత్య జరగ లేదు ( ఈ విషయం ని వై.యస్ తన దగ్గర గా ఉండే సన్నిహితులతొ చెప్పి గర్వం గా ఫీల్ అయ్యే వారు )
ప్రత్యర్ధులని చంపితే ఫ్యాక్షన్ పొదు , ప్రత్యర్ధులతొ రాజి పడితే ఫ్యాక్షన్ పొతుంది అని వై.యస్ ఫ్యక్షనిస్టులతొ చెప్పేవారు.
source By Sarath kumar dasari