తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి రాజీనామా లేఖపై తెలుగుదేశం పార్టీ జాతీయ అద్యక్షుడు , ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. రేవంత్ రెడ్డి రాజీనామా లేఖ అందలేదనిఅయన స్పష్టం చేశారు. కొన్ని సందర్భాల్లో కొన్ని జరుగుతూ ఉంటాయన్నారు. అవసరాలను బట్టి కొందరు వారికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారని తెలిపారు. పార్టీలోకి వస్తుంటారు.. వెళ్తుంటారు అని చంద్రబాబు అన్నారు .