మహేష్‌బాబు హీరోగా నటించిన టక్కరి దొంగ చిత్రం 2002లో భారీ అంచనాల మధ్య రిలీజైంది. అయితే ఘోర పరాజయం పొందింది కూడా. జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో రూపొందిన టక్కరి దొంగ చిత్రంలో బిపాసాబసు, లిసారే హీరోయిన్లుగా నటించారు. మహేష్‌బాబు కౌబాయ్‌గా నటించడంతో ఆ సినిమాపై అంచనాలు ఎక్కువగానే ఏర్పడ్డాయి. కానీ సినిమా మాత్రం డిజాస్టర్ అయింది. అయితే, ఇన్నాళ్లకు ఆ సినిమా డిజాస్టర్ కావడానికి కారణం చెబుతున్నారు ఆ చిత్ర దర్శక నిర్మాత జయంత్ సి.పరాన్జీ.
ఇంతకీ మహేష్‌బాబు టక్కరి దొంగ చిత్రం ప్లాప్ కావడానికి కారణమేంటో తెలుసా.. సరైన స్ర్టిప్ట్ లేకపోవడమే. మహేష్‌బాబుతో సినిమా చేయాలని ఆదరాబాదరాగా సెట్స్‌మీదకు తీసుకెళ్లారట. అంతేగానీ.. ముందుగానే స్ర్టిప్ట్ రాసుకోలేదట. షూటింగ్ జరుగుతున్న సమయంలోనే స్ర్టిప్ట్ రాసుకుంటూ వెళ్లారట. దాంతో పెద్ద ప్లాప్ అయింది టక్కరి దొంగ సినిమా. అయితే, ఇన్నాళ్లకు ఆ విషయం చెబుతున్నారు దర్శకులు జయంత్ సి.పరాన్జీ.
‘ప్రేమించుకుందాం రా’ సినిమా అప్పుడు ఎలా ఉన్నారో..ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. దీని వెనుక ఏదైనా రహస్యం ఉందా? అని యాంకర్ అడిగిన ప్రశ్నకి ఆయన నవ్వుతూ సమాధానం ఇచ్చారు. ఎలాంటి టెన్షన్స్ లేకుండా ఉండటమే దీనికి కారణంగా ఆయన తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ… ”ఏ విషయలోనూ టెన్షన్ అనేది పడను. సినిమా ప్లాపయినా, హిట్ అయినా ఒకేలా తీసుకుంటాను. ఇంకా చెప్పాలంటే టక్కరిదొంగ సినిమాకి చాలా నష్టం వచ్చింది. ఆ సినిమాతో అయిన అప్పులను తీర్చడానికి నాలుగేళ్లు పట్టినా టెన్షన్ పడలేదు. బ్యాలెన్స్‌గానే ఉన్నా” అంటూ జయంత్ నవ్వుతూ తెలిపారు.