టీమిండియా యువ ఆల్‌రౌండర్, హార్డ్‌హిట్టర్ హార్దిక్ పాండ్య ముంబయి ఇండియన్స్‌కు వీడ్కోలు పలకనున్నట్టు సమాచారం. ఐపీఎల్-2018 మెగా వేలంలో పాల్గొనేందుకు ఆయన సముఖత వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇప్పటికే ఈ విషయాన్ని బీసీసీఐకి వెల్లడించాడని వార్తలు వస్తున్నాయి. 2018 ఏప్రిల్ 4న ఐపీఎల్-11 ప్రారంభానికి దాదాపు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫిబ్రవరిలో ఆటగాళ్ల వేలం ప్రక్రియ ఉంటుంది.
కన్నేసిన బెంగళూరు
గత సీజన్‌లో ముంబయి ఇండియన్స్ విజేతగా నిలవడంతో హార్దిక్ పాండ్య కీలకంగా నిలిచాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బంతితో, బ్యాటుతో రాణించాడు. హోరాహోరీ మ్యాచుల్లో భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. అక్కడ్నుంచి టీమిండియాలో అడుగుపెట్టాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాక్‌పై సిక్సర్ల వర్షం కురిపించి అమాంతం క్రేజ్ పెంచుకున్నాడు. అరంగేట్రం టెస్టులోనూ అదరగొట్టాడు. ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్‌లో అద్భుత ఆటతీరుతో అలరించాడు. భారత్‌కు లభించిన బెన్‌స్టోక్స్ అంటూ సారథి విరాట్ కోహ్లీనే స్వయంగా పాండ్యను ప్రశంసించాడు.
గత రెండు సీజన్లలో రాణించిన హార్దిక్ పాండ్యకు ముంబయి ఇండియన్స్ ఇస్తున్న మొత్తం రూ.30 లక్షలు! అతడి సోదరుడు కృనాల్‌కు రూ.2 కోట్లు వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మెరుపులు మెరిపిస్తున్న హార్దిక్ వేలంలోకి వస్తే దాదాపు రూ.10 కోట్లకు పైగా చెల్లించైనా ఆయన్ను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు వెనకాడవు. ఎప్పట్నుంచో సరైన బౌలర్లు, ఆల్‌రౌండర్లు లేని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పాండ్యపై కన్నేసింది. తన హిట్టింగ్‌తో ఆట గమనాన్ని మార్చేయగల అతడిని ఎంత మొత్తమైనా చెల్లించి కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఆ జట్టు సారథి కోహ్లీకి పాండ్యకు మంచి అనుబంధం ఉంది.
