గ్రేటర్ వరంగల్ 19వ డివిజన్ లో మేయర్ నన్నపునేని నరేందర్ బైక్ పై పర్యటించారు.బైక్ పై వీది వీది కలియదిరుగుతూ ప్రజల వద్దకు వెల్లి సమస్యలు అడిగితెలుసుకున్నారు.మురికాలువలు,సీసీ రోడ్లు,సానిటేషన్ ను పరిశీలించిన మేయర్ వీలైనంత త్వరగా పనులు ప్రారంభించాలని అధికారులకు సూచించారు.స్వయంగా మేయర్ నే తమ వద్దకు రావడంతో కాలనీ వాసులు హర్షం వ్యక్తంచేశారు . ఈ సందర్బంగా కాలనీ లోని సమస్యలను కాలనీ వాసులు మేయర్ కు వివరించారు.వెంటనే అధికారులకు వాటిని పరిష్కరించాలని ఆదేశించారు వరంగల్ నగరం గొప్ప నగరంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి గారు కృషిచేస్తున్నారని,నగరంలోని అన్ని డివిజన్ల అభివృద్ది పరుస్తామని నన్ను గెలిపించి ఆశీర్వదించిన శివనగర్ ను అభివృద్దిలో నగరంలోనే ముందుంచుతానని మేయర్ నరేందర్ ఈ సందర్భంగా అన్నారు.