టిడిపి మాజీ ఎమ్.పి నామా నాగేశ్వరరావు పై ఒక మహిళ చేసిన ఆరోపణలపై ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. అయితే అది నామా వ్యవక్తిగత వ్యవహారమని ఆయన పేర్కొన్నారు. ఆయనతో చర్చిస్తానని, చూద్దాం అంటూ మీడియా సమావేశం ముగించారు కాగా తాను ముఖ్యమంత్రి చంద్రబాబు కు నామా పై పిర్యాదు చేశానని, మహిళల పట్ల నామా వ్యవహరిస్తున్న తీరుపై ఆడియో, వీడియో సిడి ల ఆధారాలను కూడా పంపించానని ,అయినా చంద్రబాబు పట్టించుకోలేదని ఆ మహిళ ఆరోపించింది.దీనిపై విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో ప్రశ్నించినప్పుడు అది ఆయన వ్యక్తిగత వ్యవహరం అని అనడం విశేషం. మరి ఇంతగా సపోర్ట్ చేస్తారాని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
