టీడీపీ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు వ్యవహారం మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తనను వేధింపులకు గురిచేస్తున్నాడంటూ సుంకర సుజాత అనే మహిళ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నగ్న చిత్రాలు బయటపెడుతానని తనను నామా నాగేశ్వరరావు వేధింపులకు గురిచేస్తున్నట్టు సుంకర సుజాత తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిసింది.
అయితే కొంతమంది మఠాధిపతులు, పీఠాధిపతులు, స్వాములు సెక్స్ స్కాముల్లో ఇరుక్కుని తనకలాడుతుంటే, తాజాగా టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు మరో సెక్స్ స్కాండల్ లో ఇరుక్కున్నారు. హైదరాబాద్ లో సుజాత అనే మహిళ నామా నాగేశ్వరరావు ఒక సెక్స్ ఉన్మాది అని, వావి వరసలు లేని కామాంధుడని, అతడి ఫేస్ బుక్ నిండా వేశ్యల ఫోన్ నెంబర్లే ఉంటాయని తీవ్రమైన ఆరోపణలు చేసింది. నామా నాగేశ్వరరావు చరిత్ర మొత్తం సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తానని సవాల్ చేసింది. నామా నాగేశ్వరరావుపై తాను పెట్టిన కేసు ఉపసంహరించుకోమని తనను బెదిరిస్తున్నారని, ఇటువంటి బెదిరింపులకు తను భయపడనని, తల్లులతో సంబంధం పెట్టుకుని కూతుళ్లపై కూడా కన్నేసే నీచుడని నామాపై ధ్వజమెత్తింది.
దీనిపై సుజాత నామాను ప్రశ్నించగా.. నీకెందుకంటూ ఆమెను బెదిరించినట్టు టేపుల్లో ఉంది. అంతేకాదు, ఆమెతో గడుపుతున్న సమయంలో నువ్వెందుకు వచ్చావని సుజాతను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. మరోసారి దీనిపై చర్చిస్తే చంపేస్తానని బెదిరించినట్టు మహిళ పేర్కొంది. అంతేకాదు, తన నగ్న ఫోటోలు బయటపెడుతానంటూ బెదిరించాడని వాపోయింది.
