ఏపీలో మరో అవీనితి ఖాకి బండారం బట్టబయలైంది. సీఐడీ విభాగంలో డీఎస్పీగా పనిచేస్తున్న హరినాథ్‌రెడ్డికి 15 కోట్ల అక్రమాస్తులు ఉన్నట్లు అవినీతి నిరోదక శాఖ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. శనివారం ఉదయం మొత్తం 9 చోట్ల ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్బంగా కర్నూలులో 2 భవనాలు, కడపలో ఒక భవనం, కర్నూల్ జిల్లా తుగ్గలిలో 10 ఎకరాల భూమి ఉన్నట్లు ఏసీబీ అదికారులు గుర్తించారు అంతేగాక ఇదే మండలంలోని పగిడిరాయి గ్రామంలోని తన బంధువుల ఇంట్లో 7 లక్షలు స్వాధినం చేసుకున్నారు.. ఇంకా కర్నూలు, కడప, తుగ్గలి, డబూరువారిపల్లి, బెంగళూరులో సోదాలు జరుగుతున్నాయి. ఈ సోదాలు పూర్తయితేగాని ఆయన అక్రమాస్తుల వివరాలను అధికారులు వెల్లడించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా హరినాథ్‌రెడ్డి గతంలో కర్నూలు జిల్లా నంద్యాలలో డీఎస్పీగా పనిచేశారు.
