Home / NATIONAL / డబ్బు కోసం హీరోయిన్ సెక్స్ బ్లాక్ మెయిల్…

డబ్బు కోసం హీరోయిన్ సెక్స్ బ్లాక్ మెయిల్…

రెండు రోజుల క్రితం కలకలం రేపిన గురునంజేశ్వర స్వామీజీ రాసలీలల పంచాయితీ శ్రీశైలం మఠాధిపతి శ్రీ చెన్నసిద్దరామ పండితారాధ్య స్వామీజీ వద్దకు చేరింది. మద్దవనవర జంగమ మఠం స్వామీజీ శివాచార్య స్వామీజీ కుమారుడు దయానంద అలియాస్ గురునంజేశ్వర స్వామీజీ ఓ యువతితో సన్నిహితంగా ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియా ద్వారా బయటకు పొక్కటం తెలిసిందే. దీంతో ఆ కుటుంబాన్ని ఆశ్రమం నుంచి బహిష్కరించాలని ట్రస్ట్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పూర్తి వివరాలు సేకరిస్తున్న శ్రీశైలం మఠాధిపతి.. తుది నిర్ణయం తీసుకుంటారని సమాచారం.

మరోవైపు ఈ వీడియోలో ఉన్నదని కొన్ని కన్నడ మీడియా ఛానెళ్లు ప్రచారం చేస్తున్న హీరోయిన్‌ మీడియా ముందుకు వచ్చారు. శుక్రవారం సువర్ణ న్యూస్‌ ఛానెల్‌ తో మాట్లాడిన ఆమె ఆ వీడియోలో ఉంది తాను కాదంటూ స్పష్టం చేశారు. అసలు దయానంద్ ఎవరో తనకు తెలీదని.. దయచేసి తన పేరును ఈ వ్యవహారంలోకి లాగొద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.

మరో కోణం…

అంతకు ముందు వెలువడ్డ కథనం ఏంటంటే… వీడియో అడ్డం పెట్టుకుని డబ్బు కోసం ఆ హీరోయిన్ బ్లాక్ మెయిల్ చేసిందని. కన్నడ మూవీలో నటించే ఆ నటి హనీ ట్రాప్‌లో స్వామీజీ చిక్కుకున్నాడని.. దయానంద్‌తో సన్నిహితంగా ఉన్న వీడియో చిత్రీకరించిందని.. అందుకు స్వామీజీ బంధువులు కూడా సహకరించారనే కథనాలు వెలువరించాయి. ఇదంతా రెండు నెలల క్రితమే జరిగిన వ్యవహారమని.. ఆసమయంలో ఓ పోలీస్‌ ఉన్నతాధికారి సమక్షంలోనే పంచాయతీ జరిగిందన్న ఆరోపణలు వినిపించాయి. అయితే పోలీస్‌ శాఖ మాత్రం ఆ ఆరోపణలను ఖండిస్తోంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat