టీడీపీకి, తన శాసనసభ సభ్యత్వానికి రేవంత్ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వరంగల్ జిల్లాలో పార్టీ ముఖ్యనేత అయిన మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేశారు. ఇటీవల రేవంత్‌తో పాటుగా నరేందర్‌రెడ్డి ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసిశారని వార్తలు వచ్చాయి. ఓటుకు నోటు కేసులో నరేందర్‌రెడ్డి ప్రమేయం ఉన్నట్లు అప్పట్లో ఏసీబీ భావించిన విషయం తెలిసిందే.