గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) టీఆర్ఎస్ కార్పొరేటర్లతో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. బేగంపేటలోని హరితప్లాజాలో సమావేశం కొనసాగుతోంది. హైదరాబాద్ నగర అభివృద్ధి కార్యక్రమాలను కార్పొరేటర్లకు మంత్రి వివరిస్తున్నారు. పెరుగుతున్న జనాభా, నగర విస్తరణ నేపథ్యంలో హైదరాబాద్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి కార్పొరేటర్లకు సూచించారు.