దేశం మొత్తం ఇప్పుడు గుజరాత్ వైపే చూస్తోంది… ప్రధాని నరేంద్ర మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్‌లో ఈ ఏడాది డిసెంబర్ 9, 14 తేదీల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపైనే అంతా చర్చ… కేంద్ర ఎన్నికల సంఘం హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల తేదీలను ప్రకటించి గుజరాత్‌వి వెంటనే ప్రకటించకపోడంతో మరింత చర్చ జరిగింది… తర్వాత ఈసీ తీరుపై విమర్శలు వెల్లువెత్తడం అనంతరం ఎన్నికల తేదీలను ప్రకటించడం జరిగిపోయాయి… అయితే ఇప్పుడు యావత్ భారతంతో పాటు ఇప్పుడు గుజరాత్ ఎన్నికలపై ఉగ్రవాదులు కూడు కన్నేసినట్టు నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి…
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో… 26/11 ముంబై దాడి తరహాలో గుజరాత్‌లో దాడులు చేసేందుక ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ప్లాన్ చేస్తున్నట్టు భారత నిఘా వర్గాలకు సమాచారం అందింది… ఆ రాష్ట్రం తీర ప్రాంతంలోకి జాలర్ల రూపంలో ఉగ్రవాదులు ప్రవేశించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నాయి నిఘా వర్గాలు. మత విద్వేషాలను రెచ్చగొట్టి భయానక వాతావరణం సృష్టించడానికి కుట్రలు చేయడంతో పాటు… ప్రధాని మోదీ… గుజరాత్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించే ర్యాలీలను టార్గెట్ చేసే కుట్రలు జరుగుతున్నాయని హెచ్చరికల నేపథ్యంలో తీరప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేయాలని గుజరాత్ పోలీసులను హెచ్చరిస్తుస్తోంది ఐబీ.