తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి ఫ్లెక్సీని రాజన్న సిరిసిల్ల టీఆర్ఎస్వీ కార్యకర్తలు దహనం చేశారు.రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌పై నిన్న అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్‌రెడ్డిపై టీఆర్ఎస్వీ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రేవంత్‌రెడ్డి మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. రేవంత్‌కు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని టీఆర్ఎస్వీ నేతలు చెప్పారు.