చర్చలో పాల్గొనకుండా కాంగ్రెస్ పార్టీ కావాలనే తొలిరోజు సమావేశానికి అంతరాయం కలిగించిందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పీ. సుధాకర్‌రెడ్డి తెలిపారు. తొలిరోజు మండలి సమావేశం వాయిదా ఆనంతరం మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. చర్చలో పాల్గొనకుండా కాంగ్రెస్ పార్టీ కావాలనే తొలిరోజు సమావేశానికి అంతరాయం కల్గించిదన్నారు. ఇదంతా వారి ముందస్తు ప్రణాళికలో భాగంగానే జరిగిందని వెల్లడించారు.
టీఆర్‌ఎస్ విప్ బీ. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. సభా సమావేశాల సజావుకు పూర్తి సహకారం అందిస్తామని బీఏసీ సమావేశం సందర్భంగా కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ ఇచ్చిన మాటను తప్పుతూ వెనక్కి వెళ్లారన్నారు. కాంగ్రెస్ సభ్యులు లేవనెత్తే అన్ని అంశాలపై సవివరంగా సమాధానం ఇచ్చేందుకు మంత్రులు సిద్ధమై సభకు వచ్చారు. కాగా చర్చలో పాల్గొనకుండా కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేయడమేమిటని ప్రశ్నించారు.