రామ్ నటించిన తొలి చిత్రం దేవదాసు తోనే హిట్ కొట్టిన రామ్ తర్వాత కమర్షిల్ చిత్రాల్ని నమ్ముకొని వరుస ప్లాపుల్ని మూటకట్టుకున్నాడు. మాస్ స్టోరీలు సెలక్ట్ చేసుకొని ఓవర్ యాక్షన్ చేస్తూ బొక్కా బోర్లా పడ్డాడు. వరుస ఫెయిల్యూర్స్ లో ఉన్న రామ్‌కి నేనే శైలజతో మంచి బ్రేక్ ఇచ్చాడు డైరెక్టర్ తిరుమల కిషోర్. ఇక నేను శైలజ సినిమాలో రామ్ పెర్పామెన్స్ చూసిన వాళ్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అందరికి తెలిసిన ప్రేమకథనే దర్శకుడు తిరుమల కిషోర్ కొత్తగా ప్రజెంట్ చేయడంతో పాటు రామ్ యాక్షన్ ఒక్కసారిగా మారిపోవడంతో అతడి నటనకు మంచి మార్కులు పడ్డాయి.
నేను శైలజ తర్వాత రామ్ మరోసారి ఫాత ఫార్మాట్‌లోకి వెళ్లిపోయి హైపర్ చేసి మళ్లీ ప్లాప్ ఇచ్చాడు. రొటీన్ కమర్షియల్ సినిమాలు తనకు కలిసిరావడం లేదని భావించిన రామ్ మళ్లీ తనకు క్లాస్ టచ్‌తో మంచి హిట్ ఇచ్చిన తిరుమల కిషోర్‌నే నమ్ముకున్నాడు. నేను శైలజ తర్వాత వీరిద్దరి కాంబోలో తెరకెక్కిన చిత్రం ఉన్నది ఒక్కటే జిందగీ మంచి అంచనాలతో ఈ శుక్రవారమే రిలీజ్ అయ్యింది. అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా శుక్రవారం వరల్డ్‌వైడ్‌గా ప్రీమియర్లు కంప్లీట్ చేసుకుంది.ఇప్పటికే ఓవర్సీస్, దుబాయ్‌లలో ప్రీమియర్ షోలు కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా టాక్ బయటకి వచ్చింది.
దర్శకుడు తిరుమల కిషోర్ ఈ సినిమాకు ఫ్రెండ్‌షిఫ్ + లవ్ స్టోరీని ఎంచుకున్నాడు. సినిమా అంతా ఈ రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ కథనం నడిపించాడు. సినిమాలో రామ్‌కు జోడీగా లావణ్య త్రిపాఠి, అనుపమ పరమేశ్వరన్‌లు ఉన్నా రామ్- అనుపమ పెర్పామెన్స్‌కే ఎక్కువ మార్కులు పడతాయి. ఫస్టాఫ్ అంతా ఫ్రెండ్‌షిఫ్, లవ్ సన్నివేశాలతో చాలా డీసెంట్‌గా కూల్‌గా సాగుతుంది. ఇంటర్వెల్‌లో వచ్చిన ఎమోషనల్ ట్విస్ట్ హార్ట్ టచ్చింగా ఉంది. అయితే సెకండాఫ్‌లో మాత్రం దర్శకుడు అంచనాలు పూర్తిగా అందుకోలేదు. కథకు కీలకమైన సెకండాఫ్‌లో కథనం చాలా స్లో అయ్యింది. ఇక ఫైనల్‌గా మంచి క్లైమాక్స్‌తో సినిమాకు ముగింపు ఇచ్చాడు. ఫైనల్‌గా చెప్పాలంటే.. ఫ్రెండ్ షిప్ ని లవ్ ని మిక్స్ చేస్తూ అనేక సినిమాలు వచ్చినా.. డైరెక్టర్ కిషోర్ తిరుముల ప్రెసెంట్ చేసిన విధానం చాల బిన్నంగా వుండడంతో, ఎమోషనల్ కంటెంట్ అద్భుతంగా ఉందనే చెప్పాలి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది . సాంగ్స్ వినడానికే కాదు చూడు కూడా చాల ప్లసెంట్ గా అనిపించాయి . దేవి మ్యూజిక్ హైలైట్ గా నిలిచింది.