రివ్యూ : రాజా ది గ్రేట్
బ్యానర్ : స‌్రవంతి సినిమాటిక్స్
తారాగణం : రామ్, అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాటి , శ్రీవిష్ణు తదితరులు..
కూర్పు : శ్రీకర్ ప్రసాద్
సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్
ఛాయాగ్రహణం : సమీర్ రెడ్డి
నిర్మాతలు : నిర్మాతలు : స్రవంతి రవికిషోర్ , కృష్ణ చైతన్య
సమర్పణ : దిల్ రాజు
రచన, దర్శకత్వం : కిషోర్ తిరుమల
విడుదల తేదీ : అక్టోబర్ 27, 2017
తనకు సూట్ అయ్యే లవ్ స్టోరీలను పక్కన పెట్టి కమర్షయల్ హీరోగా పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ చేతులు కాల్చుకుంటున్న రామ్‌ను నేను శైలజ చిత్రంతో మరోసారి తను లవర్ బాయ్‌గా ఎలా యాప్ట్ అవుతాడో చూపించారు దర్శకుడు కిశోర్ తిరుమల. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలవడమే కాకుండా.. సినిమా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. తనకు మంచి విజాయన్ని అందించిన డైరెక్టర్‌తో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు రామ్. తాజాగా వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ఉన్నది ఒక్కటే జిందగీ. రామ్ సరసన అనుపమ పరమేశ్వరన్, లావన్య తిపాటి నటించిన ఈ చిత్రాన్ని స్రవంతి రవికిషోర్ నిర్మిస్తున్నారు. ఇక ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్ళాల్సిందే.!
అభిరామ్ ( రామ్ ) ఓ నిలకడ వున్న వ్యక్తి. జీవితం సుఖమే కాదు కష్టం ఇచ్చినా తీసుకోగలిగే ధైర్యం అతని సొంతం. అలాంటి స్థిరమైన వ్యక్తిత్వాన్ని అతనికి అలవరిచేలా చేసిన బాల్యం, యవ్వనం, చదువు తర్వాత జీవితాన్ని స్పృశించిందే ఉన్నది ఒకటే జిందగీ కథ. ప్రతి మనిషి జీవితాన్ని విశేషంగా ప్రభావితం చేసే స్నేహం, ప్రేమ అభి జీవితంలో ఏమి చేశాయి. వాటిని అతను ఎలా డీల్ చేసాడు అన్నదే ఈ సినిమా. అభి చిన్నప్పుడే తల్లి ప్రేమను పోగొట్టుకొని బాధ పడుతుంటాడు. అలాంటి సమయంలో వాసు(శ్రీవిష్ణు) అనే స్నేహితుడు అతడికి దగ్గరవుతాడు. అభి, వాసు ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణం. కాలేజీ పూర్తయిన తరువాత అభికి మహా(అనుపమ పరమేశ్వరన్) అనే అమ్మాయితో పరిచయం ఏర్పడుతుంది.
ఇక ప్రతిదానికి సర్దుకుపోయే మనస్తత్వం గల మహా.. అభితో స్నేహం చేసిన తరువాత తనకు నచ్చినట్లుగా జీవించడం మొదలుపెడుతుంది. కొద్దిరోజులకు అభి.. మహాను ప్రేమిస్తాడు. మహాకు కూడా అభి అంటే ఇష్టమే. అయితే ఓరోజు సడెన్‌గా వాసు వాళ్ల ఇంట్లో మహా ఉండడం చూస్తాడు అభి. వాసు, మహా బంధువులు కావడంతో మహాని వాసుకి ఇచ్చి పెళ్లి చేయాలని ఇంట్లో వాళ్లు అనుకుంటుంటారు. వాసు కూడా మహాను ప్రేమిస్తాడు. మరి వీరిద్దరిలో మహా ఎవరిని ప్రేమిస్తుంది.. అభి స్నేహం కోసం ప్రేమను వదులుకుంటాడా.. లేక స్నేహాన్నే కాదనుకుంటాడా..? చివరి వీరి ముగ్గురి జీవితాలు ఎలాంటి మలుపును తీసుకున్నాయో తెలియాలంటే వెండితెర పై ఈ చిత్రాన్ని చూడాల్సిందే.
స్నేహం, ప్రేమ.. ఈ రెండు అంశాల చుట్టూ కథను అల్లుకున్నాడు దర్శకుడు. కథ కొత్తదేమీ కానప్పటికీ.. భావోద్వేగాలతో సినిమాను నడిపించే ప్రయత్నం చేశారు. అయితే అది కొంతవరకే వర్కవుట్ అయింది. సినిమా మొదటి భాగంలో అభి, మహాల మధ్య వచ్చే సన్నివేశాలు, వారిద్దరి మధ్య ఎమోషన్‌ను దర్శకుడు ప్రెజంట్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. అలానే అభి, వాసుల మధ్య స్నేహాన్ని కూడా తెరపై బాగా ఆవిష్కరించారు. ఈ రెండు పాత్రల మధ్య చిన్నప్పటి సన్నివేశాలు ప్రేక్షకులకు నచ్చుతాయి. తెరపై అనుపమ పరమేశ్వరన్ క్యారెక్టర్ ఉన్నంతసేపు సినిమా ఆసక్తికరంగా ఉంటుంది. ఇంటర్వల్ బ్యాంగ్ భావోధ్వేగాలతో కూడి ఉంటుంది. సెకండ్ హాఫ్ మాత్రం కాస్త సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. కథ లేకపోయినా.. స్నేహం గురించి చెప్పాలని దర్శకుడు బాగా సాగదీశారు. సన్నివేశాలను ఒకదాని తరువాత ఒకటి పేర్చినట్లుగా అనిపిస్తుంది. ఇక క్లైమాక్స్ సన్నివేశాలు మరింత రొటీన్‌గా సాగాయి.
రామ్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. కొన్ని చోట్ల ఏడిపించేశాడు కూడా. శ్రీవిష్ణు లాంటి మంచి నటుడిని తెరపై సరిగ్గా చూపించలేకపోయారు. అనుపమ పరమేశ్వరన్ చాలా అందంగా కనిపించింది. ఆమె డైలాగ్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఇక లావణ్య త్రిపాఠి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. గ్లామర్ షో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది కానీ అది అంతగా పండలేదు. ఆమె పద్ధతిగా కనిపిస్తేనే అందంగా ఉండేదేమో. ఏదో కొత్తగా కనిపించాలని ప్రయత్నించడం కలిసి రాలేదనే చెప్పాలి. ప్రియదర్శి, కిరీటిల పాత్రలు నవ్విస్తాయి. మిగిలిన పాత్రధారులు తమ పరిధుల్లో బాగానే నటించారు. టెక్నికల్‌గా సినిమా విలువలు బాగానే ఉన్నాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు మరో ప్లస్. వాట్ అమ్మా.. వాట్ ఈజ్ దిస్ అమ్మా అనే పాట బాగా కనెక్ట్ అవుతుంది. సమీర్‌రెడ్డి సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. సినిమాలో ఎడిట్ చేయాల్సిన సన్నివేశాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్ ట్రిమ్ చేసి ఉంటే సినిమాకు ప్లస్ అయ్యేది. కథ లేకుండా.. 150 నిమిషాలు కేవలం ఎమోషన్స్ మీద సినిమాను నడిపించడమంటే కాస్త కష్టమే. మొత్తానికి కిశోర్ తిరుమల ప్రేక్షకుల అంచనాలను అందుకోలేనప్పటికీ.. ఓ మోస్తురుగా ఎంటర్‌టైన్ చేశారు.
# రేటింగ్ : 2.5/5
# దరువు పంచ్ లైన్ : అంతగా కనెక్ట్ కాని జిందగీ..!