యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా గతఏడాది నేను శైలజ చిత్రం తో చక్కటి ప్రేమ కథ చిత్రాన్ని తెరకెక్కించిన కిషోర్ తిరుమల దర్శకత్వం లో తెరకెక్కిన మూవీ ఉన్నది ఒకటే జిందగీ. భారీ అంచనాల మధ్య శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక రామ్ కెరీర్‌లో నేను శైలజకు ముందు వరకు బిగ్గెస్ట్ కమర్షియల్ సినిమా ఏదంటే కందిరీగ సినిమాయే. ఆ సినిమా రూపాయికి రెండు రూపాయల లాభం తెచ్చింది.
అయితే ఆ సినిమా తర్వాత రామ్ రొటీన్ బాయ్ అయ్యి రొటీన్‌గా సినిమాలు తీసుకుంటూ పోవడంతో జనాలు కూడా రొటీన్ రామ్ అంటూ మనోడి సినిమాలు లైట్ తీస్కొన్నారు. ఆ తర్వాత రామ్ మార్కెట్ క్రమక్రమంగా డౌన్ అవుతూ వచ్చింది. ఇక గతేడాది న్యూఇయర్ రోజున విడుదల అయిన నేను శైలజ సినిమాతో రామ్ ప్రేక్షకుల ముందకు వచ్చాడు. కొత్త దర్శకుడు తిరుమల కిషోర్ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు.
సంక్రాంతికి పది రోజుల ముందు వచ్చిన ఆ సినిమా సంక్రాంతికి వచ్చిన నాలుగు సినిమాల హవా తట్టుకుని మరీ లాంగ్‌రన్‌లో రూ.30 కోట్ల షేర్ రాబట్టింది. ఇదే రామ్‌కు కెరీర్ పరంగా హయ్యస్ట్ ఫిగర్. అయితే ఇప్పుడు రామ్ తాజా చిత్రం ఉన్నది ఒకటే జిందగీ చిత్రం వరల్డ్‌వైడ్‌గా రూ.19 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసిందన సమాచారం.
ఇక ఈ చిత్రంలో రామ్ సరసన అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటించడంతో బయ్యర్లు గ్యారెంటీగా సినిమా హిట్ అవుతుందన్న కాన్ఫిడెన్స్‌తో మంచి రేట్లకే ఈ సినిమాను కొన్నారు. వరల్డ్‌వైడ్‌గా రూ.19 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జిందగీ నైజాంలో రూ. 6 కోట్లు – సీడెడ్‌లో రూ. 3 కోట్లు – ఆంధ్రాలో రూ. 7 కోట్లు చేసింది. ఓవర్సీస్, ఇతర ఏరియాల్లో మరో రూ.2 కోట్లు కలిశాయి.