ఎన్టీఆర్, త్రివిక్రమ్ టాలీవుడ్‌లో మోస్ట్ ఎవైటెడ్ కాంబినేషన్.ఈ మధ్యనే ఈ క్రేజీ కాంబినేషన్‌కి కొబ్బరికాయ కొట్టారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిధిగా ఈ సినిమా.. మొదలైపోయింది. హారిక, హాసిని బేనర్‌పై నిర్మాత చినబాబు తెరకెక్కిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లనుంది. అయితే, ఈ లోపల ఈ సినిమా స్ర్కిప్ట్‌కు సంబంధించిన లైన్ ఒకటి బయటకు వచ్చింది. ఈ సినిమాని యాక్షన్, ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తారని, ఇందులో తారక్ ఇండోనేషియా స్టైల్ మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకుంటారని వార్తలు వినిపించాయి.
యాక్షన్, రొమాంటిక్, ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తారని, ఎన్టీఆర్ మార్షల్ ఆర్ట్స్ ఇందులో ప్రధాన ఆకర్షణగా ఉండబోతుందని చెప్పుకున్నారు. అయితే, ఇదంతా అవాస్తవం. ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ ఒక క్లీన్ ఎంటర్‌టైనర్‌ను రాసుకున్నారట. తనకు కలిసొచ్చిన ఫ్యామిలీ జోనర్‌లోనే సినిమా చేయబోతున్నారు త్రివిక్రమ్. ఎన్టీఆర్ కూడా బృందావనం తరువాత ఫ్యామిలీ సబ్జెక్ట్‌ను టచ్ చేయలేదు. ఇప్పుటు ఎన్టీఆర్ ఆ లోతు తీర్చుకోబోతున్నారని టాక్.