తెలుగు బుల్లితెర హాట్ కామెడీ ప్రోగ్రాం.. జబర్ధస్థ్ షోలో ఒన్ ఆఫ్ ది పార్టీసిపెంట్‌గా కామెడీ పండించి మంచి ఫేం సంపాదించిన షకలక శంకర్ తర్వాతికాలంలో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. మొన్నామద్య సూపర్ హిట్ అయిన ఆనందోబ్రహ్మ సినిమాలో షకలక శంకర్ క్యారెక్టరే హైలైట్. రామ్ గోపాల్ వర్మను ఇమిటేట్ చేయడంలో శంకర్ సిద్ధహస్తుడు. అందుకే మనోడి చేత వర్మని ఇమిటేట్ చేసే షోలు స్పెషల్ గా చేయించుకొనేవారు.
అయితే ఇప్పుడు ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకొంటూ కథానాయకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నాడు షకలక శంకర్. డ్రైవర్ రాముడు అనే సినిమాతో హీరోగా పరిచయమవ్వనున్నాడు. సీనియర్ ఎన్టీయార్ కెరీర్‌లో బ్లాక్ బస్టర్స్‌లో ఒకటైన డ్రైవర్ రాముడు చిత్రంలో షకలక శంకర్ ఎన్టీయార్‌ను ఇమిటేట్ చేయనున్నాడని ఫస్ట్ లుక్ లోనే తెలిసిపోతుంది. ఇక ఆర్జీవీని శంకర్ అద్భుతంగా ఇమిటేట్ చేస్తాడని తెలుసు కానీ అన్నగారిని ఎంతవరకు ఇమిటేట్ చేసి కామెడీ పండిస్తాడనేది సినిమా విడుదల అయితే గానీ తెలియదు.