టాలీవుడ్ ప్రముఖ నిర్మాత.. హీరో రామ్ ను బ్లాక్ మెయిల్ చేశారా.. రామ్ కు సుమారు ఆరేళ్ల కిందట తాను ఇచ్చిన అడ్వాన్సు మొత్తం కోటిన్నరరూపాయలను వడ్డీతో సహా వసూలు చేసుకోవడం కోసం.. ఒక స్కెచ్ ప్రకారం బ్లాక్ మెయిల్ ఎపిసోడ్ నడిపించాడనే వార్త ఇప్పుడు ఫిల్మ నగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
అసలు విషయం ఏంటంటే.. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ గతంలో హీరో రామ్‌తో కందిరీగ చిత్రం చేసిన విషయం తెలిసిందే. అది విజయవంతం అయ్యాక దానికి సీక్వెల్ కూడా చేయాలని అనుకున్నారు. అందుకోసం హీరోకు ఒకటిన్నర కోటి ఎడ్వాన్సుగా చెల్లించాడు. కథలను విన్న రామ్ వాటిని తిరస్కరించాడు. వాటిలో ఒకటి రభస చిత్రంగా తెరకెక్కింది. అయితే ఆ తర్వాత బెల్లంకొండ- రామ్ కాంబినేషన్‌లో చిత్రం మాత్రం రాలేదు.
అయితే ఏళ్లు గడుస్తున్నా రామ్ తాను తీసుకున్న ఎడ్వాన్సు కూడా తిరిగి ఇవ్వలేదట. దీంతో విసిగిపోయిన బెల్లంకొండ.. రామ్ లేటెస్ట్ మూవీ ఉన్నది ఒకటే జిందగీ రిలీజ్ రెడీగా ఉండడంతో ఆ చిత్రానికి సంబంధించిన హార్డ్ డిస్క్ సంపాదించాడట బెల్లంకొండ.. తన అడ్వాన్స్ నాకు తిరిగి ఇవ్వకపోతే.. ఆ సినిమా ఆన్ లైన్ లో రిలీజ్ చేసేస్తానని రామ్‌ని బెదిరించాడట. అయినా రామ్ లైట్ తీసుకోవడంతో ఆ చిత్రానికి సంబంధిచి కొన్ని వీడియో క్లిప్పింగ్‌లు వాట్సప్ ద్వారా పంపించాడట.
దీంతో షాక్ తిన్న రామ్ పరిశ్రమ పెద్దల సమక్షంలో ఆ వ్యవహారాన్ని సెటిల్ చేసుకున్నారట. ఇండస్ట్రీలో ఇప్పుడు ఈ పుకార్లు విచ్చలవిడిగా షికారు చేస్తున్నాయి. ఈ పుకార్లను అటు బెల్లంకొండ సురేష్, నిర్మాత రవికిషోర్ కూడా ఖండించారు. అయితే అడ్వాన్సులు వసూలు చేసుకోవడంలో నిర్మాతల తాలూకు ఇది కొత్త ఎత్తుగడ కావడంతో.. సోషల్ మీడియాలో ఈ వ్యవహారం అంతా వైరల్‌గా ప్రచారం అవుతోంది. అయినా సినీ పరిశ్రమలో ఇలాంటివి అన్నీ కామన్ అని సినీ వర్గీయులు చర్చించుకుంటున్నారు.