బాహుబలి తరువాత ప్రభాస్ రేంజ్ ఏ స్థాయిలో పెరిగిందో.. అతని పుట్టిన రోజు జరిగిన వేడుకలను బట్టే చెప్పొచ్చు. ప్రభాస్ పుట్టిన రోజుకి పలు చోట్ల బహిరంగ వేదికలు కట్టి వేడుకలా చేశారు అభిమానులు. సోషల్ మీడియాలో కూడా ప్రభాస్ పుట్టిన రోజు వేడుకలు బాగానే జరిగాయి.
నెక్ట్స్ నెం.1 ప్రభాసేనా అనేంతగా సందడి జరిగింది. కానీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజున జరిగిన సందడికంటే ఇది తక్కువేనని ట్విట్టర్ లెక్కలు తేల్చాయి. పవన్ బర్త్‌డేకి 29 లక్షల ట్వీట్లు పడితే.. ప్రభాస్‌కి 21 లక్ష ట్వీట్లు వచ్చాయి. బాహుబలి ప్రభాస్‌కి దేశవ్యాప్తంగా స్పందన వచ్చిందని గుర్తించాలి. దేశ వ్యాప్తంగా సపోర్ట్ దొరికినా కానీ.. ఇక్కడ పవన్ అభిమానుల సందడిని మాత్రం వారు దాటలేకపోయారు. మహేష్, ఎన్టీఆర్ పుట్టిన రోజుకు జరిగినదాంతో పోలిస్తే మాత్రం ప్రభాస్‌కి చాలా ఎక్కువే సందడి చేశారని చెప్పాలి.సాహో చిత్రం ఫస్ట్‌లుక్ కూడా దేశ వ్యాప్తంగా కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా ట్రెండై ప్రభాస్ స్టార్‌డమ్ ఎలా ఉందనే దానిపై ఐడియా వచ్చింది.రాజమౌళి ముద్ర లేకుండా సాహోతో గనక ప్రభాస్ మళ్లీ విజయాన్ని అందుకుంటే మాత్రం అతని స్టార్‌డమ్ డబుల్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.