తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం పెరిగిందని వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మంత్రి సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని అయన తెలిపారు.రాష్ట్రంలో వైద్య రంగ అభివృద్ధికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని మంత్రి స్పష్టం చేశారు. గత ప్రభుత్వాల హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో హెల్త్ సెక్టార్ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని గుర్తు చేశారు. ఆశా వర్కర్లకు నెలకు రూ. 6 వేల ప్రోత్సాహకం అందిస్తున్నామని అయన స్పష్టం చేశారు.