కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ నిప్పులు చెరిగారు. శాసనసభలో స్పీకర్ పోడియంను చుట్టుముట్టి సభకు అంతరాయం కలిగిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అయన ఫైర్ అయ్యారు . ప్రశ్నోత్తరాలకు ఆటంకం కలిగించడం సరికాదన్నారు. బీఏసీలో నిర్ణయించిన మేరకు సభ్యులంతా సభకు సహకరించాలని చెప్పారు.సభ సజావుగా సాగేందుకు కాంగ్రెస్ సభ్యులు సహకరించాలని కోరారు. సభకు ఆటంకం కలిగినస్తున్న కాంగ్రెస్ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అన్ని విషయాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని చెప్పినప్పటికీ.. ఆందోళన చేయడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు.