తమిళ్ స్టార్ హీరో విజయ్ నటించిన మెర్స్‌ల్ చిత్రం తమిళంలో విడుదల అయ్యి కోలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఇక ఈ చిత్రాన్ని తెలుగులో అదిరింది పేరుతో విడుదల చేయనున్న విషయం తెలిసిందే. అయితే గత వారమే విడుదల అవ్వాల్సిన అదిరింది చిత్రం కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. ఇక ఈ శుక్రవారం విడుదల కావాల్సి ఉండగా అర్ధాంతరంగా ఆగిపోయింది.
అదిరింది మూవీకి సెన్సార్ పూర్తి అయ్యింది. కాకపోతే అది చెన్నైలో కంప్లీట్ అయింది. తెలుగులో ఈ సినిమాను విడుదల చేస్తున్న శరత్ మరార్‌కు చెన్నై నుంచి సకాలంలో సెన్సార్ సర్టిఫికేట్ అందలేదట. పైగా విడుదలపై ఒరిజినల్ నిర్మాణ సంస్థ తేనాండాళ్ స్టుడియోస్ ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో మూవీ రిలీజ్ మరోసారి వాయిదాపడింది.
మరో వైపు ఈ సినిమా రిలీజ్ కాకపోవడానికి కారణం రాజకీయ పరమైన ఇబ్బందుల రీత్యానే మీడియా వర్గాలు కధనాలు ప్రసారం చేస్తున్నాయి. జీఎస్టీపై హీరో విజయ్ వేసిన డైలాగ్ ల నేపధ్యంలో అసంతృప్తి వ్యక్తం చేసిన బీజేపీ నేతలు, ఈ సినిమా రిలీజ్ కు బ్రేకులు వేసినట్లుగా సమాచారం. బహుశా వచ్చే వారంలో మళ్ళీ విడుదలకు సన్నాహాలు చేయవచ్చు.
ఇక గత వారం తమిళంలో విడుదలైన ఈ సినిమాకు భిన్న స్పందనలు వచ్చినప్పటికీ, వివాదం నేపధ్యంలో తలెత్తిన పబ్లిసిటీ సినిమాకు బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి. దీంతో మెర్సల్ చిత్రానికి మొదటి వారానికి ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 170కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. ఇదే ఊపులో తెలుగులో కూడా సినిమాను విడుదల చేసి క్రేజ్ ను క్యాష్ చేసుకుందామనేది శరత్ మరార్ అనుకోగా.. అదిరింది మాత్రం ముచ్చటగా మూడోసారి వాయిదాపడింది.