Home / MOVIES / మెర్సల్ వివాదం.. మ‌ద్రాస్ హైకోర్టు సంచ‌ల‌న తీర్పు..!

మెర్సల్ వివాదం.. మ‌ద్రాస్ హైకోర్టు సంచ‌ల‌న తీర్పు..!

త‌మిళ్ స్టార్ హీరో విజయ్ న‌టించిన మెర్సల్ చిత్రంలో జీఎస్టీ, నోట్ల రద్దుతో పాటు వైద్యుల పట్ల వ్యతిరేకంగా కొన్ని డైలాగ్స్ ఉండటంతో బీజేపీకి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న విషయం తెల్సిందే. మెర్సల్ చిత్రంలో కొన్ని అభ్యంతరకర డైలాగులు, సన్నివేశాలు ఉన్నాయి. వీటిపై తీవ్ర దుమారం చెలరేగింది. దాంతో ఓ తమిళ సినిమా కాస్తా, జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యింది. దీంతో ఈ చిత్ర ప్రదర్శనను నిలిపివేయాలని కోరుతూ మద్రాస్ హైకోర్టులో దాఖలైన పిటీష‌న్‌ను మ‌ద్రాస్ హై కోర్టు కొట్టి వేసింది.

మైలాపూర్‌కు చెందిన అడ్వకేట్ అశ్వథామన్.. సినిమా సెన్సార్‌ను సీబీఎఫ్‌సీ పునర్ పరిశీలించాలని మద్రాస్‌హై కోర్టులో ప్రజా ప్రయోజనాల వాజ్యం కింద పిటిషన్ వేశారు. మెర్సల్ చిత్రంలో.. జీఎస్టీ, నోట్ల రద్దుపై దేశాన్ని తప్పుగా చూపించార‌ని.. సినిమాలో ఉన్న డైలాగ్‌లు, సీన్లు.. మన కొత్త పన్ను విధానాన్ని బలహీనంగా చూపిస్తున్నదని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఈ రోజు తన తీర్పుని వెలువరించింది.సాధారణంగా సినిమా అంటేనే ఊహాజనితమని నచ్చకపోతే చూడొద్దని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. శుక్రవారం ఆ పిటిషన్‌ బెంచ్‌ ముందుకు రాగా.. దానిని కొట్టివేస్తున్నట్లు ప్రకటించారు. మెర్సల్‌ అనేది ఓ చిత్రం కల్పితగాథేనని.. నిజ జీవితం కాదని ఈ సందర్భంగా న్యాయమూర్తి పేర్కొన్నారు. ఇది సమాజంపై ప్రభావం చూపుతుందనటం అర్థరహితమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ధూమపానం, మద్యపానం హనికరమంటూ ప్రకటనలు జారీ చేసే చిత్రాలకంటే మెర్సల్‌ అంత ప్రమాదకరమైందా అంటూ న్యాయమూర్తి పిటిషనర​ తరపు న్యాయవాదిని ప్రశ్నించారు. సినిమా నచ్చకపోతే చూడకండి.. అంతేగానీ ఇలా పిటిషన్లతో సమయాన్ని వృథా చేయకండి అంటూ మండిపడ్డారు. మెర్సెల్‌కు కాస్త ఊరట వివాదాలతో సినిమాకు ఫ్రీ పబ్లిసిటి లభించిందని జడ్జి వ్యాఖ్యానించారు. ఈ తీర్పు మెర్సెల్ కు కాస్త ఊరటనిచ్చింది.

అట్లీ దర్శకత్వంలో విజయ్ హీరోగా నటించిన మెర్సల్ చిత్రం కలెక్షన్లతో పాటు.. కాంట్రవర్శీలతోనూ సంచ‌ల‌నం రేపింది. ఓ బీజేపీ నేత అయితే, తాను సినిమాని పైరసీ వెర్షన్‌ని చూశానంటూ వివాదాల్లోకెక్కడం, ఇంకొందరు జోసెఫ్‌ విజయ్‌ అంటూ విజయ్‌ మతం గురించి వివాదాలు తెరపైకి తీసుకురావడం.. ఇలా మెర్సల్‌ చుట్టూ తలెత్తిన వివాదాలు అన్నీ ఇన్నీ కావు. ఇన్ని వివాదాలు సృష్టించినవారికి ఒకటే చెంపదెబ్బ.. అదీ మ‌ద్రాసు హైకోర్టు ద్వారా తగలడం విశేషమే మరి.

ఇక మ‌ద్రాసు హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పుతో.. తెలుగు వెర్ష‌న్ అదిరింది విషయంలో ఉన్న అడ్డంకులు కూడా తొలగిపోవచ్చని భావిస్తున్నారు. ఇప్పటిదాకా తమిళ వెర్షన్ వల్ల ఏర్పడ్డ దుమారం వల్లనే తెలుగులో మళ్ళీ అవే డైలాగులతో అనుమతించటానికి వెనకడుగు వేసారు సెన్సార్ బోర్డ్ సభ్యులు, తాజా తీర్పు నేపథ్యం లో ఇక తెలుగు అదిరింది కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది.

అయినా బూతు సినిమాల్ని ఎంచక్కా తిలకిస్తున్నాం.. ఆఖరికి పోర్న్‌ సినిమాల్ని సైతం ఇంటర్నెట్‌ ద్వారా దేశంలోకి తీసుకొచ్చేశాం.. ఓ సామాజిక అంశంపై ఓ దర్శకుడి ఆలోచనల్ని మాత్రం తెరపై చూసి జీర్ణించుకోలేకపోతున్నారు ఇది ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌ని.. సోష‌ల్ మీడ‌యాలో కాషాయం బ్యాచ్ పై నెటిజ‌న్లు దుమ్మెత్తి పోస్తున్నారు. ఇక హైకోర్టు తీర్పుతో ర‌చ్చ ర‌చ్చ చేసిన బీజేపీ నేత‌లు దిమ్మ‌తిరిగే షాక్ త‌గిలింద‌ని స‌ర్వ‌త్రా చ‌ర్చించుకుంటున్నారు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat