పలు ప్రమాదాల్లో గాయపడ్డ రోగులను ఆదుకోవాల్సిన ప్రభుత్వ ఆస్పత్రిలో నీచపు పనికి ఒడిగట్టారు సిబ్బంది. రోగులకు సహాయ సహకారాలు అందించాల్సిన వారు.. వారి అక్రమ సంబంధానికి ఆస్పత్రి రూంనే వాడుకున్నారు. అంతటితో ఆగక.. ఆ రూములో వారి కామ వాంఛనను తీర్చుకునేందుకు రెచ్చిపోయి మరీ సెక్స్ చేశారు. రోజూ జరిగే ఈ తంతును గమనించిన రోగులు వారిని పై అధికారులకు పట్టించారు. ఈ సంఘటన హైదరాబాద్ నగర పరిధిలోగల గాంధీ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. సరసాలాడుతూ అడ్డంగా దొరికిపోయాడు ఓ సెక్యురిటీ గార్డ్. బీహార్‌కు చెందిన ఓ సెక్యురిటీ గార్డ్ కిందిస్థాయి ఉద్యోగినితో శృంగారంలో పాల్గొంటూ రోగుల కంటపడ్డాడు. దీంతో రోగులు గదికి తాళమేసి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. స్పాట్‌కు అధికారులు, పోలీసులు చేరుకునే సమయానికి సెక్యురిటీగార్డ్ అతని సహచరులు తప్పించారు.దీంతో ఆగ్రహించిన ఉన్నతాధికారులు సెక్యురిటీ వింగ్‌లో ఉన్న బీహార్ సిబ్బందిని తప్పించారు.
