ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఉభయ సభల్లో 11.30 గంటల వరకు ప్రశ్నోత్తరాలు కొనసాగాయి.శాసనసభను డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, మండలిని ఛైర్మన్ స్వామిగౌడ్ ప్రారంభించారు. ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన తర్వాత.. సభ, మండలిని వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఛైర్మన్ స్వామిగౌడ్ ప్రకటించారు. ఉభయసభలు సోమవారం తిరిగి ప్రారంభం కానున్నాయి.
