దక్షిణాది సంచలన దర్శకుడు శంకర్ రూపొందిస్తున్న భారీ చిత్రం రోబో 2.0.లో సూపర్ స్టార్ రజనీ, అక్షయ్ కుమార్, ఎమీ జాక్సన్ లాంటి హేమీ హేమీలు ఉన్నారు. ఇక ఈ చిత్రంలో ఫైట్లు, ఛేజ్ లు, ఇంకా ఇంకా చాలా చాలా వుండే ఈ సినిమాలో ఒకే ఒక్క పాట వుందట. ఈ విషయాన్ని సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ స్వయంగా బయటపెట్టారు.
అసలు మూడు పాటలు కంపోజ్ చేసినప్పటికీ సినిమాలో మాత్రం ఒక్క పాటే ఉంటుందని… మిగతా రెండు పాటలను తాను 2 0 ఆడియో వేదిక మీద లైవ్ పెరఫార్మెన్స్ ఇవ్వబోతుననట్లుగా చెప్పాడు. మరి దర్శకుడు శంకర్ ఈ ఒక్క పాట కోసమే దాదాపు 32 కోట్లు ఖర్చు పెట్టాడా.. అలాగే ఈ ఒక్క పాట విడుదల కార్యక్రమాన్ని వేదికగా.. దుబాయ్‌ని ఎంచుకున్నారు.
అలాగే ఈ వేడుకకి 12 కోట్లు ఖర్చు పెట్టడం చూస్తుంటే మాత్రం ఈ సినిమా పబ్లిసిటీ ఒక రేంజ్ లో ఉందని చెప్పొచ్చు. కానీ కేవలం ఒక్క పాట విడుదల కోసం ఈ లెవల్లో 12 కోట్లు ఖర్చు చేయిస్తున్నాడు అంటే శంకర్ మామూలోడు కాదు. అయినా శంకర్ అడిగినా నిర్మాతలు లైకా వారు ఎటువంటి అబ్జెక్షన్స్ లేకుండా దాన్ని అమలు చెయ్యడం మాత్రం గొప్ప విషయమే కదా అని సినీ వర్గీయులు చర్చించుకుంటున్నారు.
ఇక మరోవైపు 2.0 సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పబ్లిసిటీ మీద ఫోకస్ పెట్టింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకి అన్ని భారీగానే ఉన్నాయి. పబ్లిసిటీ కోసమే కోట్లు ఖర్చు పెడుతున్నారు. అందులో భాగంగానే ఈ సినిమా ఆడియో వేడుక ఈ రోజు శుక్రవారం దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫాలో అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ చిత్రంలో శంకర్ మ్యాజిక్ ఈ విషయంలో ఎలా వుంటుందో చూడాలి. తెలుగునాట ఈ సినిమా 81కోట్లకు హక్కులు అమ్ముడుపోయిందని సమాచారం.