Home / SLIDER / హైద‌రాబాద్ విష‌యంలో…ఫ‌లించిన సీఎం కేసీఆర్‌,మంత్రి కేటీఆర్ కృషి

హైద‌రాబాద్ విష‌యంలో…ఫ‌లించిన సీఎం కేసీఆర్‌,మంత్రి కేటీఆర్ కృషి

హైదరాబాద్‌ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) ఆర్థికంగా బలోపేతమైంది. గడిచిన రెండేళ్ల క్రితం సంస్థ ఖజానా కేవలం రూ. 10కోట్లకు మించని పరిస్థితి నుంచి ప్రస్తుతం రూ. 432 కోట్లకు చేరి స్వయం సమృద్ధిని సాధించింది. ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యంతో నిర్వీర్యానికి గురై..చేతిలో చిల్లి గవ్వ లేకుండా ప్రతిపాదిత ప్రాజెక్టులు పట్టాలెక్కక, ఇటు నిధుల కొరతతో అసంతృప్తి నిలిచిపోయిన పథకాలు, అనుమతుల జారీలో అవినీతి మయం..మొత్తంగా హెచ్‌ఎండీఏ అంటేనే ఒకరకమైన అభిప్రాయం ఉండేది. కానీ ప్రస్తుతం సంస్థ స్వరూపమే మారింది. సంస్థ ఛైర్మన్‌, సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ నిరంతర పర్యవేక్షణ, సమర్థవంతమైన అధికార యంత్రాంగం వెరసి  సత్వర సేవలు..పారదర్శక సేవలతో పౌరుల్లో విశ్వాసాన్ని చూరగొన్నది. అంతేకాదు పరిశ్రమలు, ఇటు నిర్మాణ రంగ అనుమతులను నిర్ణీత సమయంలో పారదర్శకంగా వ్యవహరించి ప్రభుత్వ స్థాయిలో సంస్థ ప్రశంసలు అందుకుంది.
దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న బాటా సింగారం, మంగళ్‌పల్లి లాజిస్టిక్‌ పార్కులతో పాటు రూ. 383 కోట్లతో బాలానగర్‌ భారీ ౖఫ్లె ఓవర్‌ నిర్మాణం, శంషాబాద్‌ విమానాశయ్రానికి మెరుగైన రవాణాకు రూ. 40కోట్లతో మరో ఫై ఓవరు, పీ 7 రహదారి నిర్మాణం, రూ. 6కోట్లతో కిస్మత్‌పుర బ్రిడ్జి లాంటి ప్రాజెక్టులను పునర్జీవం పోసి విశ్వ నగరాభివృద్ధిలో తమ వంతు పాత్రను పొషిస్తున్నది. దాంతో పాటు ఐటీ ముప్పు నుంచి బయటపడింది. కమిషనర్‌ ఆఫ్‌ ఇన్‌కం ట్యాక్స్‌ (మినహాయింపు) విభాగంతో వాదనలు జరిపి ఐటీ యాక్ట్‌ 1961 12A(1)(II) పరిధిలోకి సంస్థను తీసుకువచ్చారు. ఫలితంగా 2007-2008, 2008-2009 సంవత్సరానికి గానూ రూ.670కోట్ల ఊరట పొంది సంస్థ ఉద్యోగుల నెలవారీ జీతభత్యాలకు పూర్తి స్థాయి భరోసా కల్పించింది. మరీ ముఖ్యంగా కోకాపేటలో 670ఎకరాల భూములపై విజయం సాధించి రూ. 12వేల కోట్ల మేర ఆదాయం ప్రభుత్వ ఖజానాలోకి చేర్చారు. ప్రధానంగా 12 ఏండ్లుగా పరిష్కారం నోచుకోని ఉప్పల్‌ భగాయత్‌ రైతుల సమస్యకు పరిష్కారం, ఔటర్‌ రింగు రోడ్డులో అసంపూర్తిగా ఉన్న పనుల్లో వేగం పెంచి 99శాతం మేర పూర్తి చేయడం, చెరువుల పరిరక్షణ..ఒకటేమిటీ అన్నింటిలో జవసత్వాలు నింపారు.
ప్రతిపాదిత ప్రాజెక్టులు కార్యరూపలంలో వచ్చాయి. ప్రస్తుతం సంస్థ పరిధిలో రూ.వందల కోట్లతో ప్రభుత్వ, ప్రైవేట్‌ పార్టనర్‌ షిప్‌ పద్దతి (పీపీపీ)లో ప్రాజెక్టు పనులను చేపడుతున్నారు. లాజిస్టిక్‌ హబ్స్‌లు పీపీపీ పద్దతిలో చేపడుతుండగా సంస్థ నిధులతో రూ. 383కోట్లతో బాలానగర్‌ ౖఫ్లె ఓవరు పనులు, సంగారెడ్డి మున్సిపాలిటీల్లో రహదారి విస్తరణ, ఇతర మౌలిక వసతులకు రూ. 10కోట్లు, భువనగిరి మున్సిపాలిటీల్లో రూ. 15కోట్ల అభివృద్ధి పనులు, ఇబ్రహీంపట్నంలో దాదాపు రూ. 5కోట్లతో పనులు జరుగుతున్నాయి. అంతేకాదు రూ. 47కోట్లతో పీ7 రహదారి, ౖఫ్లె ఓవరు పనులు, దాదాపు రూ.22కోట్లతో ఉప్పల్‌లో లే అవుట్‌ అభివృద్ధి పనులు, హుస్సేన్‌సాగర్‌, మూసీ సుందరీకరణ పనులు జరుగుతున్నాయి. వీటితో పాటు ఔటర్‌ రింగు రోడ్డులో జైకా నిధులతో హెచ్‌టీఎంఎస్‌, ఐటీఎస్‌లతో పాటు రేడియల్‌ రోడ్ల నిర్మాణం, టోల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ భవనాల నిర్మాణం, ఎల్‌ఈడీ కండ్లకోయ జంక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
డీపీఎంఎస్‌ ద్వారా అవినీతిరహిత అనుమతులకు శ్రీకారం చుట్టారు. నెలలో అన్ని కలిపి దాదాపు 30కి పైగా అనుమతులను నిర్ణీత 15 రోజుల వ్యవధిలో మంజూరు చేస్తున్నారు.క్రమబద్ధీకరణ పథకం ఉమ్మడి రాష్ట్రంలో కంటే మెరుగైన ప్రదర్శన కనబర్చారు. 2007-13 సంవత్సరాల మద్య కాలంలో 52వేల ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల్లో ఆరేళ్లలో కేవలం 38వేలు మాత్రమే పరిష్కారం చూపారు. కానీ ప్రస్తుతం 1, 71 లక్షల దరఖాస్తుల స్వీకరణలో కేవలం ఏడాదిన్నర వ్యవధిలోనే 1, 21వేలు పరిష్కరించడం, అందులో పారదర్శకంగా వ్యవహరించడం గమనార్హం.జవహర్‌నగర్‌లో 2370.25 ఎకరాల స్థలం విషయంలో నెలకొన్న న్యాయపరమైన చిక్కులను అధిగమించడం, ఎన్టీఆర్‌ మార్గ్‌లో దాదాపు 3 ఎకరాల భూమిలో తిష్ట వేసిన డాక్టర్‌కార్స్‌ లీజు రద్దు, ఐమాక్స్‌ థియేటర్‌ పక్క అథారిటీకి చెందిన 2500 చ.మీల విస్తీర్ణమున్న భూమిని పాగా వేసిన హోటల్‌ మల్లిగి సంస్థ లీజును రద్దు చేయించి తిరిగి టెండర్ల ద్వారా సంస్థకు గణనీయమైన ఆదాయాన్ని రాబట్టారు. ఔటర్‌కు హరితశోభను తీసుకొచ్చారు. చెరువుల పరిరక్షణలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో మాస్టర్‌ప్లాన్‌లో దొర్లినా తప్పులను సరిదిద్దుతూ మార్పులు, చేర్పులు చేస్తున్నారు. త్వరలోనే ఏకీకృత మాస్టర్‌ప్లాన్‌ రూపకల్పనకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఉద్యోగుల కొరతను అధిగమించి ప్రభుత్వ లక్ష్యాలను అనుగుణంగా పనిచేన్న తీరు అభినందనీయమనే చెప్పాలి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat