తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ రోజు మధ్యాహ్నం తెలంగాణ టీడీపీ నేతలతో అయన సమావేశం అయ్యారు.అనంతరం అయన మాట్లాడుతూ…ఏ పార్టీలోనైన సంక్షోభం రావడం, సమసిపోవడం చాలా సర్వసాధారణమని అన్నారు. ఇటువంటి చిన్న చిన్న విషయాలు మొదటగా పెద్దవిగా కనిపిస్తాయనితరువాత చిన్నవైపోతాయని అన్నారు . తన హయాంలో పార్టీ అనేక సవాళ్లను ఎదుర్కొందని, అన్నింటి నుంచి బయటపడి తలెత్తుకు నిలిచామని అన్నారు.తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు పోయినా తాను లెక్క చేయనని, తనకు కార్యకర్తలు, క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజాబలమే ముఖ్యమని ఈ సందర్భంగా అన్నారు . తెలంగాణలో తిరిగి అధికారంలోకి వస్తామనే నమ్మకం తనకుందని, అందుకు తగ్గ కృషి నాయకులు కూడా చేయాలని పార్టీ నేతలకు సూచించారు.
ఇదిలావుండగా.. మొదటగా ఎవరితోనూ ఒంటరిగా మాట్లాడేది లేదని చెప్పినప్పటికీ, సమావేశం తరువాత పార్టీ వివాదానికి కేంద్ర బిందువుగా నిలిచిన రేవంత్ రెడ్డితో రెండు నిమిషాలు విడిగా భేటీ అయినట్టుసమాచారం . ఆ సమయంలో ఇద్దరి మధ్యా జరిగిన మాటా మంతిపై వివరాలు తెలియకున్నా, అందరినీ రేపు విజయవాడకు రమ్మని పిలుస్తూ, చంద్రబాబు అమరావతికి బయలుదేరి వెళ్ళారు.