Home / TELANGANA / పత్తి అమ్మిన వెంటనే నేరుగా రైతుల ఖాతాలోకి చెల్లింపులు..

పత్తి అమ్మిన వెంటనే నేరుగా రైతుల ఖాతాలోకి చెల్లింపులు..

పత్తి రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ లను మార్కెటింగ్ మంత్రి హరిశ్ రావు ఆదేశించారు.ఇకపై ప్రతి వారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్టు తెలిపారు.తెలంగాణలో 200 పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. పత్తి కొనుగోలు కేంద్రాలు రైతులకు సమీపంలో ఉండే విధంగా వికేంద్రీకరించాలని హరీశ్ రావుకోరారు.పత్తి,ధాన్యం,మొక్క జొన్న, సోయాబీన్ తదితర పంటల దిగుబడి, మార్కెట్ లో ప్రస్తుతం ఉన్న ధర , రైతులను ఆదుకోవడానికి తీసుకోవలసిన చర్యలపై శుక్రవారం నాడు సచివాలయం నుంచి మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా చూడాలన్నారు.ప్రస్తుతం బహిరంగ మార్కెట్ లో నాణ్య‌త గ‌ల ప‌త్తి మద్దతు ధర 4320 రూపాయల కన్నా ఎక్కువ లభిస్తున్నట్టు మంత్రి చెప్పారు. అయితే పత్తికి ధర రావడం లేదనే వార్తలు వస్తున్నాయన్నారు. పత్తి మార్కెటింగ్ సీజను ముగిసే వరకు జాయింట్ కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలని,మార్కెట్లను ప్రతిరోజూ సందర్శించాలని మార్కెటింగ్ మంత్రి హరీశ్ రావు కోరారు. జె.సి,ఆర్.డి.ఓ, ఎం.ఆర్.ఓ తరచూ విలేకరుల సమావేశాలు నిర్వహించి ప్రభుత్వం రైతులను ఆదుకోవడానికి తీసుకుంటున్న చర్యలపై విస్తృతంగా ప్రచారం కల్పించాలని కోరారు.

జిల్లా జాయింట్కలెక్టర్,వ్యవసాయ,మార్కెటింగ్అధికారులు రెగ్యులర్ గా పత్తి కొనుగోలు కేంద్రాలను సందర్శించాలని కోరారు. పత్తి తేమ శాతం 12 లోపే ఉండేటట్లు రైతులలో అవగాహన పెంచాలని మంత్రి కోరారు. ఈ మేరకు విస్తృతంగా ప్రచారం చేయాలని, జిన్నింగ్ మిల్లుల దగ్గర రైతుల‌పై అధ‌న‌పు చార్జీల భార‌ము వేయ‌కుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని అన్నారు. వాటి ఫిర్యాదుల‌ పరిష్కరించడానికి గాను ఒక నెంబర్ కూడా ప్రచారం చేయాలన్నారు. పరిస్థితిని సమీక్షించి సమస్యలు ఏవైనా ఉంటే అక్కడి కక్కడే పరిష్కరించాలని హరీశ్ రావు అధికార యంత్రాంగాన్ని కోరారు. పత్తి కొనుగోళ్ల ప్రక్రియలో తీసుకొనవలసిన జాగ్రత్తలు, ఏర్పాట్లను మార్కెటింగ్ మంత్రి సమీక్షించారు. రైతు సమన్వయ సమితి కార్యదర్శులు, స్థానిక వ్యవసాయ అధికారులను భాగస్వాములు చేసి రైతు ల సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. ఈ విష‌య‌మై రైతు స‌మ‌న్వ‌య స‌మితి క‌న్వీన‌ర్ల‌తో క‌లెక్ట‌ర్లు మ‌రియు సంయుక్త క‌లెక్ట‌ర్లు స‌మావేశం ఏర్పాటు చేయాల‌ని కోరారు.

ఏ ప్రాంతాల్లో ఎంత పత్తి పండించారో సమగ్రడాటా అందుబాటులో ఉండాలని కలెక్టర్లను మంత్రి కోరారు. చరిత్రలో మునుపు ఎన్నడు లేని విధముగా తెలంగాణలో పత్తి పండిస్తున్నందున, దానికి తగ్గట్టుగా కొనుగోలు ఏర్పాట్ల కోసం గత జూన్ నుంచే ప్రభుత్వం చర్యలు ప్రారంభించిన విషయాన్ని హరీష్ రావు గుర్తు చేశారు.ఈ సంవత్సరం పత్తి కొనుగోలు కేంద్రాలను 143కు పెంచడానికి కేంద్రం సుముఖత చూపిందన్నారు. జిన్నింగ్ మిల్స్ ను కూడ అవసరమైన మేరకు కొనుగోలు కేంద్రాలుగా నోటిఫై చేసినందున మొత్తం 200 కొనుగోలు కేంద్రాలు రైతులకు అందుబాటులో కి వస్తాయని మంత్రి హరీశ్ రావు చెప్పారు.ఇప్పటిదాకా ఇంకా నోటిఫై చేయని చోట జిన్నింగ్ మిల్లులను నోటిఫై చేయాలని మంత్రి ఆదేశించారు.

పత్తి రైతులు ఎటువంటి అందోళన చెందకుండా మార్కెట్లో అమ్ముకునేలా ఏర్పాట్లు జరిగాయని చెప్పారు. మద్దతు ధర తగ్గిన వెంటనే కాటన్ కార్పొరేషన్ పత్తి కొనుగోలు కు ఏర్పాట్లు జరిగాయని మార్కెటింగ్ మంత్రి తెలిపారు.శని, ఆదివారాల్లో అన్ని ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను సంబంధిత స్థానిక ఎం.ఎల్.ఏ, ఎం.ఎల్. సి, మంత్రులు,ఎం.పిలతో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించే చర్యలు చేపట్టాలని మార్కెటింగ్ అధికారులను మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. రైతులకు గుర్తింపు కార్డులు జారీ చేయాలని కోరారు. పత్తి అమ్మిన వెంటనే 48 నుంచి 72 గంటలలోపు రైతుల ఖాతాకు నేరుగా ఆన్ లైన్ లో చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ లు,మార్కెటింగ్ అధికారులను మంత్రి కోరారు.గతంలో మాదిరి కాకుండా అన్ని కొనుగోలు కేంద్రాలు వారంలో 6 రోజులు పూర్తి స్థాయిలో పనిచేయాలని హరీశ్ కోరారు. సి.సి.ఐ. కొనుగోలు కేంద్రాలలో తప్పనిసరిగా కాటన్ కార్పోరేషన్ అధికారి ఒకరు పత్తి క్రయవిక్రయాలను పర్యవేక్షించాలని కోరారు. సంయుక్త క‌లెక్ట‌ర్లు జిల్లాలోని అన్ని జిన్నింగ్ మిల్లుల య‌జ‌మానుల‌తో వెంట‌నే స‌మావేశం ఏర్పాటు చేసి ప‌త్తి రైతుల‌కు చెల్లిస్తున్న ధ‌ర‌పై స‌మీక్ష జ‌ర‌పాల‌ని ఆదేశించారు. జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాల‌లో పెండింగ్‌లో ఉన్న జిన్నింగ్ మిల్లుల అగ్రిమెంట్‌ల‌ను రెండు రోజుల‌లోగా పూర్తి చేయాల‌ని వ‌రంగ‌ల్ సి.సి.ఐ. బ్రాంచి మేనేజ‌ర్ సిన్హా ని ఆదేశించారు. ఈ విష‌య‌మై ఆయా జిల్లాల‌ సంయుక్త క‌లెక్ట‌ర్లు, మార్కెటింగ్ శాఖ అధికారులు ప‌ర్య‌వేక్షించాల‌ని ఆదేశించారు.కొన్ని చోట్ల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరవడంలో జాప్యం జరుగుతోందని, వాటి వేగం పెంచాలని హరీశ్ రావు కోరారు.వీడియో కాన్ఫరెన్స్ లో వ్యవసాయ శాఖ కార్యదర్శి పార్థసారధి, కమిషనర్ డాక్టర్ జగన్మోహన్, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీ బాయి తదితరులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat