తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో నేడు తెలంగాణ రాష్ట్ర టీడీపీ నేతలు ఉదయం 11గంటలకు లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌లో సమావేశంకానున్నారు. తొమ్మిది రోజుల విదేశీ పర్యటన అనంతరం చంద్రబాబు ఉదయం హైదరాబాద్ కు చేరుకున్నారు. అయితే… 11గంటలకు సమావేశం నిర్వహిస్తుండగా ఈ సమావేశానికి రావాలని రేవంత్‌రెడ్డికి కూడా ఆహ్వానం అందింది. ఇదిలా ఉండగా ఈ సమావేశంలో ప్రధానంగా రేవంత్‌రెడ్డి అంశమే చర్చకు వచ్చే సూచనలు ఉన్నాయి. ఆయన నవంబర్ 9వ తేదీన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని తెలుస్తుండగా దీనిపైనే చర్చ జరగనుండనుందని తెలుస్తోంది.