ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీ ,సీనియర్ నేతలు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం అయిన సంగతి తెల్సిందే .ఈ సందర్భంగా వైసీపీ పార్టీ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఆ పార్టీ శాసనసభ పక్ష ఉపనేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాకు తెలిపారు .
ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు .గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి ఎమ్మెల్యేలను అధికార టీడీపీ పార్టీలో చేర్చుకోవడమే కాకుండా అందులో నలుగురుకి మంత్రి పదవులివ్వడంపై వైసీపీ ఈ నిర్ణయం తీసుకున్నది ఆయన తెలిపారు .తాము సభకు హాజరు కావాలంటే పార్టీ మారిన ఇరవై మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన స్పీకర్ ను డిమాండ్ చేశారు .