ప్రముఖ తమిళ హీరో ,నడిగర్ సంఘం అధ్యక్షుడు విశాల్ మరో సారి తన గొప్ప మనస్సును చాటుకున్నారు .అది టాలీవుడ్ అయిన కోలీవుడ్ అయిన బాలీవుడ్ అయిన ఆఖరికి హాలీవుడ్ అయిన కానీ ఏ ఇండస్ట్రీకి చెందిన హీరో అయిన కానీ ఎక్కడ ఏసీ కారులో నుండి దిగితే చర్మం కమిలిపోతుంది .ఎండ తగులుతుంది అని తెగ హైరానా పడుతూ కారు దిగరు .
ఇలాంటి చాలా మంది హీరోలను ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నాం .అయితే విశాల్ మాత్రం తమిళ నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చిన కానీ అక్కడ వెంటనే ప్రత్యక్షమవుతాడు .గత కొద్ది రోజులుగా తమిళ రైతులు గిట్టుబాటు ధర కోసం దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో రోజులు తరబడి దీక్షలు చేస్తుంటే హీరో విశాల్ పరామర్శించాడు .రైతులతో మాట్లాడిన విశాల్ కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ను కలిశారు .
ఆ సమయంలో తను ఒక ప్రముఖ స్టార్ హీరో కావడమే కాకుండా రాష్ట్ర సినిమా ఇండస్ట్రీకి అధ్యక్షుడు అనే విషయాన్నీ మరిచి కేంద్ర మంత్రి అయిన అరుణ్ జైట్లీ కనీసం కూర్చోమని కూడా చెప్పకుండా కాలు మీద కాలేసుకొని కూర్చొని మంత్రి మాట్లాడుతున్న కానీ ఏ మాత్రం అవమానకరంగా భావించకుండా చేతులు కట్టుకొని మరి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించిన తీరు యావత్తు భారతావనిని ఆకర్షించింది .అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నేను వెళ్ళింది నా రైతన్నల సమస్యల పరిష్కారం కోసం .రాచ మర్యాదల కోసం కాదు అని చెప్పడంతోనే విశాల్ యొక్క హుందాతనం యావత్తు లోకానికే అర్ధమైంది .కనీసం విశాల్ ను చూసి అయిన మిగతావారు మారతారు ఏమో కాలమే సమాధానం చెప్పాలి ..