ఛత్తీస్ గఢ్ రాష్ట్రం రాజ్ నందగామ్ జిల్లా పల్లెమూడి అటవీ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఐటిబిపి బలగాలు, ఛత్తీస్ గఢ్ పోలీసులు సంయుక్తంగా జరిపిన ఆపరేషన్ లో ముగ్గురు మావోలు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఎన్ కౌంటర్ బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో జరిగినట్టు సమాచారం. మృతుల్లో దళాకమాండర్ రాకేశ్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
