తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమెల్యే అనుముల రేవంత్ రెడ్డి వివాదం రోజు రోజుకు ఒక మలుపు తిరుగుతుంది .ఈ క్రమంలో ప్రస్తుతం తెలంగాణ టీడీపీలో ఒక ఎస్ఎంఎస్ తెగ కలవరం రేపుతుంది .అసలు ఏమిటి ఈ ఎస్ఎంఎస్ అని తెగ ఆలోచిస్తున్నారా ..?.ఎస్ఎంఎస్ కలవరం రేపడం ఏమిటి అని గింజుకుంటున్నారా ..?.అసలు ముచ్చట ఏమిటి అంటే ఇటీవల రేవంత్ రెడ్డి రెండు రోజులపాటు ఢిల్లీలో చక్కర్లు కొట్టిన సంగతి విదితమే .
ఈ పర్యటనలో రేవంత్ ఎఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశారు .కలవడమే కాకుండా రేవంత్ తనతో సహా ఇరవై ఐదు మంది నేతలతో టీడీపీ పార్టీను వీడి డిసెంబర్ తొమ్మిదో తారీఖున మీ సమక్షంలో కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకుంటాం అని హామీ ఇచ్చారుఅని వార్తలు టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ దృష్టికి వచ్చింది అంట .పక్క ఆధారాలు తన దగ్గర ఉన్నాయి అని రమణ తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రేవంత్ రెడ్డిను కేవలం ఎమ్మెల్యేగా పరిగణించాలని ..టీడీపీ సంబంధిత పదవుల నుండి తప్పించాలని ..అవసరమైతే పార్టీ నుండి సస్పెండ్ చేయాలనీ కోరుతూ లేఖ రాశారు .
అంతే దీనికి ఒక అధ్యక్షుడుగా నువ్వు తీసుకునే ఏ నిర్ణయమైన సరే నాకు సమ్మతం అని బాబు రిప్లై ఇచ్చారు అంట .అంతే రమణ ఉన్నఫలంగా నిన్న రేవంత్ నువ్వు ఒక పార్టీ ఎమ్మెల్యే మాత్రమే ..నువ్వు వర్కింగ్ ప్రెసిడెంట్ కాదు .పార్టీ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొనవద్దు .నిర్వహించే అధికారం లేదు అని ఒక ఎస్ఎంఎస్ పంపాడు అంట అంతే రేవంత్ తనను చాలా తీవ్ర అవమానకర పరిస్థితుల్లో ఒక ఎస్ఎంఎస్ ద్వారా నన్ను పార్టీ వ్యవహారాల నుండి తప్పించాడు అని పార్టీ సీనియర్ల దగ్గర వాపోయాడు అంట .ఇప్పుడు రమణ పంపిన ఒక ఎస్ఎంఎస్ టీటీడీపీలో తీవ్ర కలవరం రేపుతుంది .