తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరతారు అనే వార్తలు వస్తున్న సంగతి తెల్సిందే .ఈ వార్తలపై ఇటు రేవంత్ రెడ్డి ఖండించకపోగా త్వరలోనే టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కల్సి అంత వివరిస్తాను ..అందరి బాగోతాలను బయటపెడతాను అని ఇవాళ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు .
అయితే ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన డిసెంబర్ తొమ్మిదో తారీఖున చేరతారు అని వార్తలు వస్తోన్నాయి .ఈ వార్తలకు బలం చేకూర్చే విధంగా ఈ రోజు రాష్ట్ర అసెంబ్లీ ఆవరణలో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది .రేపటి నుండి జరగనున్న శాసనసభ సమావేశాల కోసం జరుగుతున్న బీఏసీ సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన రేవంత్ రెడ్డికి రాష్ట్ర కాంగ్రెస్ నేతలు స్వాగతం పలికారు. వెల్‌కమ్ రేవంత్ అంటూ… షేక్‌హ్యాండ్ ఇచ్చారు.
సీనియర్ నేత షబ్బీర్ అలీతో పాటు పొంగులేటి సుధాకర్, ఎమ్మెల్యే సంపత్ రేవంత్‌ను దగ్గరికి తీసుకొని ఆలింగనం చేసుకున్నారు. అయితే ప్రస్తుతం రేవంత్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సిందేనంటూ టీ-టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు లేఖ రాయడం… వెంటనే చంద్రబాబు స్పందించడం… పార్టీ అధ్యక్షుడిగా ఏ నిర్ణయం తీసుకున్నా… నాకు ఓకేనంటూ సంకేతాలు ఇవ్వడంతో రేవంత్ పార్టీ మారడం ఖాయం అంటున్నాయి రాజకీయ వర్గాలు .