టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ ఎనర్జిటిక్ హీరో రామ్ తాజాగా నటించిన మూవీ ‘ఉన్నది ఒకటే జిందగీ’ .ప్రపంచ వ్యాప్తంగా రేపు విడుదలకు కూడా సిద్ధమైంది .ఇలాంటి తరుణంలో హీరో రామ్ గురించి ఒక వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో తెగ వైరల్ అవుతుంది .అదే ఏమిటి అంటే తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ లోని ఫిల్మ్ ఛాంబర్‌లో ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్, రామ్ మధ్య ఒక పంచాయితీ నడిచిందని తెలుస్తోంది.
అది టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించి బంపర్ హిట్ కొట్టిన ‘రభస’ సినిమా తొలుత రామ్‌తో చేయాలని నిర్మాత బెల్లకొండ సురేష్ అనుకున్నారు. దీంతో ఆయన అడ్వాన్స్‌గా రామ్‌కు కోటి రూపాయలు ఇచ్చారు. ఆ తరువాత దర్శకుడు సంతోష్ శ్రీనివాస్.. ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పి ఒప్పించాడు. దీంతో బెల్లంకొండ ప్లేట్ మార్చి ఎన్టీఆర్‌తో సినిమా చేసేశారు. దీంతో రామ్ ఖంగుతిన్నాడు. ఇదిలా ఉంటే తానిచ్చిన అడ్వాన్స్ తిరిగిచ్చేయాలంటూ రామ్‌ను బెల్లకొండ సురేష్ అడిగారు.
తనకు తెలియకుండానే ప్రాజెక్ట్‌ను వేరే హీరో దగ్గరకు తీసుకెళ్లడమే కాకుండా ఇప్పుడు అడ్వాన్స్ తిరిగి ఇమ్మని ఎలా అడుగున్నారని రామ్ సీరియస్ అయ్యాడట. అడ్వాన్స్ తిరిగిచ్చే ప్రసక్తే లేదని రామ్ చెప్పాడట. ఇక చేసేదేమీ లేక కొద్దిరోజులుగా సైలెంట్‌గా ఉన్న బెల్లంకొండ.. ఇప్పుడు రామ్ కొత్త సినిమా రిలీజ్ టైమ్ చూసుకొని ఛాంబర్‌లో పంచాయతీ పెట్టారట. ఈ విషయాన్ని పెద్దది చేయడం ఇష్టంలేని రామ్ డబ్బుని తిరిగివ్వడానికి సిద్ధమయినట్లు తెలుస్తోంది.అయితే డబ్బు ఇవ్వకపోయినా పర్లేదు కానీ.. తనతో సినిమా చేయమని అడిగారట బెల్లంకొండ. కానీ రామ్ మాత్రం సినిమా చేయనని, డబ్బు తిరిగి ఇచ్చేస్తానని చెప్పినట్లు సమాచారం. ఇప్పుడు ఇది వైరల్ అవుతుంది .ఇది ఎంతవరకు నిజమో కాలమే చెప్పాలి ..