టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అరుదైన ఘనతను అందుకున్నాడు. నిన్న బుధవారం టీం ఇండియా -న్యూజిలాండ్ మధ్య పూణే లో జరిగిన రెండో వన్ డే మ్యాచులో మూడో ఓవర్లో భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో కివీస్ ఓపెనర్ గప్తిల్ వికెట్ కీపర్ ధోనీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ క్యాచ్‌తో సొంతగడ్డపై 200 క్యాచ్‌లను పట్టిన తొలి భారత వికెట్ కీపర్‌గా ధోనీ రికార్డు సృష్టించాడు.అయితే ఇప్పటిదాకా కుమార సంగక్కర(శ్రీలంక), స్టీవార్ట్(ఇంగ్లాండ్) మాత్రమే తమ తమ దేశాల్లో 200పైగా క్యాచ్‌లను అందుకున్నారు. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో ధోనీ ఇప్పటి వరకు 288 క్యాచ్‌లు పట్టాడు. అడమ్ గిల్‌క్రిస్ట్(417), మార్క్ బౌచర్(402), సంగక్కర(383) మాత్రమే వన్డే క్రికెట్‌లో ధోనీ కంటే ముందు ఉన్నారు.