Home / SLIDER / అనాథ చిన్నారులకు అండగా కేటీఆర్

అనాథ చిన్నారులకు అండగా కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ త‌న దృష్టికి వ‌చ్చే ప్ర‌జా స‌మ‌స్య‌ల విష‌యంలో ఎంత చురుకుగా, ద‌యా హృద‌యంతో స్పందిస్తారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్కర్లేదు. సంద‌ర్భం ఏదైనా…స‌మ‌స్య ఇంకేదైనా మంత్రికి చేర‌వేయాల‌నుకుంటే ఎవ‌రినో ఆశ్ర‌యించి ద‌ర‌ఖాస్తులు రాసి…క్యూల‌ల్లో నిల్చొని వాటిని అందించాల్సిన అవ‌స‌రం లేదు. కేవ‌లం ఒక ట్వీట్ చేస్తే చాలు. అది కూడా బాధితులే కావాల్సిన అవ‌స‌రం లేదు. అసలు విషయం ఏమిటంటే

రాజన్నసిరిసిల్ల జిల్లా త౦గళ్లపల్లి మ౦డల౦ సార౦పల్లిలో తల్లిదండ్రులు మరణించి ఇద్దరు చిన్నారులు అనాధలయ్యారు. అప్పులు.ఆర్థిక ఇబ్బందులతో ముద్ద౦ రాజు మూడేళ్ల క్రితం ఉరి వేసుకొని ఆత్మహత్య కు పాల్పడ్డాడు. అప్పటినుండి అక్షయ(10) అభిషేక్ (8) ,లను తల్లి పద్మ కూలీ పని చేస్తూ..పోశి౦చుకు౦టువచ్చి౦ది. భర్త మరణం తో పద్మ మానసికంగా కృ౦గిపోయి మ౦చ౦ పట్టి౦ది. ఖరిదైన వైద్య౦ అ౦దక మరణి౦చి౦ది‌. దీ౦తో అక్షయ,అభిషేక్ లు అనాధలుగా మారారు. దహన సంస్కారాలకు కూడా చిల్లిగవ్వ లేని పరిస్థితులలో గ్రామస్తులే చ౦దాలతో నిర్వహి౦చే౦దుకు ము౦దుకువచ్చారు.

ఈ  చిన్నారుల దీనస్తితిపై స్థానికులు ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా, చిన్నారులని ఆదుకుంటామని, వెంటనే చర్యలు చేపట్టాలని కలెక్టర్ కృష్ణ భాస్కర్  ను మంత్రి కేటీఆర్ ఆదేశించారు.తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన తంగళ్ళపల్లి మండలం సారంపల్లికి చెందిన చిన్నారులు అక్షయ, అభిషేక్ లకు తానున్నానంటూ అభయమిచ్చారు మంత్రి కేటిఆర్.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat