వయస్సుతో సంబంధం లేకుండా తలనొప్పి వస్తుంటుంది. అయితే ఇలా వచ్చే తలనొప్పిని తగ్గించుకునేందుకు ప్రతీ సారీ మందులు మింగడం మనకు అలవాటై పోయింది. వాటితో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతాయో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో కింద ఇచ్చిన పలు చిట్కాలను పాటిస్తే తలనొప్పిని ఎఫెక్టివ్‌గా తగ్గించుకోవచ్చు. ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
1. ఒక గ్లాసుడు గోరువెచ్చటి నీళ్లు తీసుకొని దాంట్లో కొంచెం నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమం తాగడం వల్ల నొప్పి తీవ్రత తగ్గుతుంది. ఈ చిట్కా చాలా తలనొప్పులకు పనిచేస్తుంది. ఎందుకంటే తలనొప్పులు చాలా వరకు కడుపులో గ్యాస్ చేరడం వల్ల వస్తాయి. ఈ మిశ్రమం కడుపులోని గ్యాస్‌తోపాటు, తలనొప్పిని కూడా తగ్గిస్తుంది.
2. తలనొప్పి తగ్గించుకోవడానికి మరో మార్గం తలకు యూకలిప్టస్ తైలంతో మర్దన చేయడం. ఎందుకంటే యూకలిప్టస్ మంచి నొప్పి నివారణి.
3. ఆవు పాలు వెచ్చబెట్టి తాగితే తలనొప్పి తగ్గుతుంది. తరచుగా తల నొప్పి వస్తుంటే భోజనంలో నెయ్యి చేర్చుకుంటే మంచి గుణం కనిపిస్తుంది.
4. ధనియాలు, చక్కెర, నీళ్లు కలిపి తాగినా కూడా తలనొప్పి తగ్గుతుంది. జలుబు వల్ల వచ్చిన తలనొప్పయితే ఈ వంటింటి చిట్కా చాలా మంచి ప్రభావాన్ని చూపుతుంది.
5. గంధపు చెక్కపై నీళ్ల చుక్క వేసి రాయి మీద రుద్ది పేస్టులాంటి గంధం తీయాలి. దీన్ని నుదుటి మీద రాసుకుంటే తలనొప్పి పూర్తిగా తగ్గుతుంది.
6. తలకు కొబ్బరి నూనెతో 10, 15 నిమిషాల పాటు మర్ధనా చేసుకుంటే తలనొప్పి తగ్గిపోతుంది. వేసవిలో వచ్చే తలనొప్పికి ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుంది. కొబ్బరి నూనె మాడుకు చల్లదనాన్ని ఇస్తుంది.
7. కొన్ని వెల్లుల్లి రెబ్బలు తీసుకొని వాటి నుంచి రసం తీసి కనీసం ఒక టీస్పూన్ వెల్లుల్లి రసం తాగాలి. ఇలా చేస్తే తలనొప్పి తగ్గిపోతుంది.
8. కుర్చీలో కూర్చొని పాదాలను వేడి నీళ్లు నింపిన బకెట్‌లో ఉంచాలి. నిద్రకు ముందు ఇలా కనీసం పావుగంట పాటు చెయ్యడం వల్ల దీర్ఘకాలికంగా ఉన్న తలనొప్పి, సైనస్ వల్ల వచ్చిన తలనొప్పి తగ్గిపోతుంది. ఇలా రెండు నుంచి మూడు వారాల పాటు చెయ్యాలి.
9. ఉదయం నిద్ర లేవగానే ఒక ఆపిల్ ముక్కకు ఉప్పు రాసుకొని తినాలి. తర్వాత గోరు వెచ్చని నీళ్లు లేదా పాలు తాగాలి. ఇలా క్రమం తప్పకుండా పదిరోజుల పాటు చేస్తే ఎప్పటినుంచో వేధిస్తున్న తలనొప్పి కూడా తగ్గిపోతుంది.
10. బాదం నూనె వెచ్చబెట్టి 15 నిమిషాల పాటు తలకు మర్థన చేస్తె తలనొప్పి తగ్గిపోతుంది.
11. కొత్తి మీర, జీలకర్ర, అల్లం కలిపి చేసిన కషాయం తాగితే తలనొప్పి తేలికగా వేగంగా తగ్గిపోతుంది. నీళ్లల్లో కొత్తిమీర, జీలకర్ర, అల్లం వేసి మరిగించి దాన్ని వడపోసి తాగాలి. తలనొప్పి తగ్గే దాకా రోజుకు రెండు మూడు సార్లు తాగాలి.
12. తలనొప్పి వల్ల బాధ పడుతుంటే వెన్న, చాక్లెట్లు, మాంసాహారం వంటి పదార్థాలు అసలు తీసుకోకూడదు. విటమిన్ సి, డి, బి12, మాంసకృత్తులు, కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. క్యాబేజీ, కాలిఫ్లవర్, మెంతి కూర, ఇతర ఆకు కూరల్లాంటి పచ్చటి, ఆకు పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. తలనొప్పి రాకూడదనుకుంటే బయటదొరికే జంక్ ఫుడ్ తీసుకోవడం మానెయ్యాలి.