గత కాలంనుండి ఓ డ్యాన్స్ షోకు రేణుదేశాయ్ జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం మనందరికీ తెలిసినదే .ఆ షోలో అంతా రియల్ లైఫ్ కపుల్ తమ నాట్యంతో ఎంటర్‌టైన్ చేస్తున్నారు. ఇటీవల ఓ నెటిజన్ ఈ షోపై కామెంట్ చేశారు. “ఆ షోలో పెర్ఫార్మ్ చేస్తున్నవారెవరూ డ్యాన్సర్స్ కాదు.. వాళ్లు మళ్లీ సీరియల్స్ చేసుకోవడం బెటర్.. వారిని డ్యాన్సర్లుగా చూడలేకపోతున్నాం” అని చరణ్ అనే నెటిజన్ రేణుకు ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌పై రేణు ఆగ్రహం వ్యక్తం చేశారు. “నీవు తప్పుగా అర్థం చేసుకున్నావు. ఈ షో కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ కోసమే.. సీరియస్ డ్యాన్స్ కాంపిటీషన్ కాదు. ఇది నిజ జీవిత సెలబ్రిటీ జంటలతో చేస్తున్న షో” అని రీ ట్వీట్ చేశారు.
