సమయం ఆదాకోసం మంత్రి కాన్వాయ్ ఓ రైతు పొలం నుంచి వెళ్లడంతో పంట నష్టం జరిగింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. జైళ్లశాఖ సహాయమంత్రి జై కుమార్ సింగ్ బుధవారంనాడు బుందేల్‌ఖండ్‌లో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మొదటగా ఓ గ్రామంలో పశువులపాక ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. అక్కడినుంచి బయల్దేరి వేరే కార్యక్రమానికి హాజరయ్యేందుకు బయల్దేరారు. మెయిన్‌రోడ్‌కు చేరుకునే క్రమంలో మంత్రి కాన్వాయ్ రైతు దేవేంద్ర దోరేకు చెందిన ఆవాల చేను నుంచి వెళ్లింది. గమనించిన రైతు వెంటనే కాన్వాయ్‌ను ఆపి మంత్రి కాళ్లపై పడి ప్రాధేయపడ్డాడు. స్పందించిన మంత్రి సంఘటనా స్థలంలోనే రైతుకు రూ. 4 వేలు ఇచ్చి వెళ్లిపోయారు. కాగా తాను రూ. 8 వేలు లోన్ తీసుకుని ఆవాల పంట వేసినట్లు రైతు పేర్కొన్నాడు.
