సినీ నటుడు కమల్ హాసన్ తన రాజకీయ ప్రవేశం గురించి సంచలన ప్రకటన విడుదల చేశారు. అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న తన రాజకీయ ప్రవేశం గురించి మాట్లాడుతూ.. అందరు ‘సిద్ధంగా ఉండండి.. అన్ని విషయాలు నవంబరు 7న చెబుతా’ అంటూ ఆయన తమిళ పత్రిక ఆనంద్ వికటన్‌కు రాసిన ఆర్టికల్‌లో పేర్కొన్నారు. తన రాజకీయ ప్రవేశం గురించి యువశక్తి అంతా ఆసక్తికరంగా ఎదురుచూస్తుందన్నారు. వారికి నేతృత్వం వహించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.నిస్వార్థంగా తమిళనాడుకు ఎటువంటి అరమరికలు లేకుండా సేవ చేయాలనుకునే వారికి మాత్రమే నవంబరు 7న జరిగే సమావేశం స్వాగతం పలుకుతుందన్నారు. ఇప్పటికే తమిళనాట కమల్ రాజకీయ ప్రవేశం గురించి విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గత నెల ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ అధినేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కమల్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే.
