బెంగళూరు నగర శివార్లలోని యలహంక సమీపంలోని హుణసమారణహళ్ళిలోని మద్దేవణపుర మఠంలో స్వామీజీ ఒక నటితో రాసలీలలు జరుపుతున్న వీడియో గురువారం వెలుగులోకి వచ్చింది. మఠంలోని బెడ్ రూంలో నటితో స్వామీజీ రాసలీలలు జరుపుతున్న సమయంలో రహస్యంగా వీడియో తీసి దానిని గురువారం విడుదల చేశారు. 500 ఏళ్ల చరిత్ర, మూడు వేల ఎకరాలు భూములు, వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్న మద్దేవణపుర మఠాధిపతి శివాచార్య స్వామీజీ కుమారుడు దయానంద అలియాస్ గురునంజేశ్వర స్వామీజీ నటితో రాసలీలలు జరిపాడు. భక్తులు గురువారం మఠం ముందు ఆందోళనకు దిగారు.
300 ఎకరాల భూములు, శ్రీశైలం మఠం
దయానంద అలియాస్ నంజేశ్వర స్వామీజీ వెంటనే మఠం ఖాళీ చేసి వెళ్లిపోవాలని భక్తులు ఆందోళన చేస్తున్నారు. శ్రీశైలం మఠంకు అనుభందంగా ఉన్న మద్దేవణపుర మఠం కోసం మైసూరు రాజులు 300 ఎకరాల భూములు ఉచితంగా ఇచ్చారు. ఈ మఠంకు ప్రతి రోజు వేల సంఖ్యలో భక్తులు వెలుతుంటారు.
మఠంలో వ్యభిచారమా ?
ఎంతో చరిత్ర ఉన్న మఠంలో వ్యభిచారం చెయ్యడం ఏమిటని భక్తులు నిలదీస్తున్నారు. మఠాధిపతి శివాచార్య స్వామీజీకి ఇద్దరు భార్యలు ఉన్నారు. దయానంద అలియాస్ గురునంజేశ్వర స్వామీజీ తల్లి చిక్కమ్మ మాట్లాడుతూ శివాచార్య స్వామీజీ మఠంలో లేరని ఒక్క రోజు అవకాశం ఇస్తే అన్నీ మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని భక్తులకు మనవి చేశారు. ఇటీవల రూ. 13 కోట్ల విలువైన మఠం ఆస్తులు అక్రమంగా విక్రయించారని తెలిసిందని, వెంటనే మర్యాదగా మీ అంతకు మీరు మఠం ఖాళీ చెయ్యకపోతే మెడపట్టి బయటకు గెంటేస్తామని గ్రామపంచాయితీ అధ్యక్షుడు హెచ్చరించారు. వేల కోట్ల విలువైన ఆస్తులు స్వాహా చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారని గ్రామపంచాయితీ అధ్యక్షుడు ఆరోపించారు.
దయానంద అలియాస్ గురునంజేశ్వర స్వామీజీ 10వ తరగతి పరీక్షలు రాసే సమయంలో గైడ్ చూసి రాస్తున్నారని అధికారులు డీబార్ చేశారు. అలాంటి చరిత్ర ఉన్న దయానందను మఠాధిపతి చెయ్యాలని ప్రయత్నాలు చేస్తున్నారని భక్తులు ఆరోపించారు.
రాసలీలల వీడియో వైరల్..
మద్దేవనపుర మఠంను సంసారం చేసే మఠంగా మార్చేశారని భక్తులు విమర్శించారు. రెండు గంటల్లో మఠం ఖాళీ చేసి వెళ్లిపోవాలని భక్తులు హెచ్చరించారు. గురునంజేశ్వర స్వామీజీ, నటి రాసలీలల వీడియో సోషల్ మీడియా, టీవీలల్లో వైరల్ అయ్యింది. ముందు జాగ్రత్త చర్యగా వంద మందికి పైగా పోలీసులు మఠం దగ్గర భద్రత కల్పిస్తున్నారు.