సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న నూతన చిత్రం భరత్ అనే నేను. వరుస విజయాలతో ఫుల్ ఫాంలో ఉన్న కొరటాల శివ దర్శతక్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ యువ రాజకీయ నాయకుడిగా కనిపించనున్నాడు. ముందుగా ఈ సినిమాను సంక్రాంతికే రిలీజ్ చేయాలని భావించినా.. స్పైడర్ రిజల్ట్ తేడా కొట్టేయటంతో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.అందుకు తగ్గట్టుగా సినిమాను వేసవికి వాయిదా వేశారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాను 2018 ఏప్రిల్ 27న రిలీజ్ చేయనున్నట్టుగా చిత్రయూనిట్ ప్రకటించారు. ఈ సినిమాలో మహేష్ సరసన బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.
