తెలంగాణ రాష్ట్రంలో టీడీపీలో వేగంగా చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి స్పందించారు. దీనిపై అయన మాట్లాడుతూ, తన పోరాటం సీఎం కేసీఆర్ పైనేనని అన్నారు.టీడీపీలో చోటుచేసుకుంటున్న పరిణామాలన్నీ కేసీఆర్ నెత్తిన పాలుపోసేలా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. టీడీపీలో అంతర్గత గొడవలు సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. పార్టీని చంద్రబాబు సరిదిద్దుకోలేని విధంగా చేసేందుకు తాపత్రయపడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.చంద్రబాబునాయుడు హైదరాబాదు వచ్చేలోగా పార్టీని నాశనం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.చంద్రబాబు వచ్చిన తరువాత అన్నీ ఆయనకు వివరిస్తానని రేవంత్ రెడ్డి తెలిపారు. తనను పరుష పదజాలంతో విమర్శించినా రమణ నోరుమెదపలేదని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. క్యాడర్ కోలుకునేలా నాయకుడు వ్యవహరించాలని ఆయన సూచించారు. క్యాడర్ ను చూస్తే బాధగా ఉందని ఆయన పేర్కొన్నారు.
